ఇంతకీ అది నోబాలేనా? మీరేమంటారు?
ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 222 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు మొదట తడబడింది. కాని చివర్లో ఢిల్లీ బ్యాట్స్మెన్ పావెల్ దూకుడైన ఆట చూస్తే ఇక ఢిల్లీకి విజయం వరిస్తుందేమో అన్న విధంగా మారింది దీంతో ఉత్కంఠ భరితంగా మారిన మ్యాచ్లో ఒక వివాదం చోటు చేసుకుంది. అయితే చివరి ఓవర్ లో మూడో బంతిని రాజస్థాన్ బౌలర్ మెక్కాయ్ వేశాడు.
ఈ క్రమంలోనే ఆ బంతిని పావెల్ సిక్సర్ గా మలిచాడు. కానీ ఆ బంతి పావెల్ నడుము కంటే ఇక వికెట్ల పైనుంచి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవంగా అయితే అంపైర్లు దానిని నో బాల్ గా ప్రకటించాలీ. కానీ అంపైర్లు మాత్రం ప్రకటించలేదు. దీంతో డగౌట్ లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళం సృష్టించారు. అంపైర్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజులో ఉన్న ఆటగాళ్లు రిటైర్డ్ ఔట్ గా డగౌట్ కి రావాలి అంటూ కెప్టెన్ రిషబ్ పంత్ సైగ చేశాడు. ఇలా చివరి ఓవర్లో నోబల్ విషయంలో హైడ్రామా నడిచిం.ది మరి ఈ వీడియో చూసిన తర్వాత అభిప్రాయం ఏంటో చెప్పండి.