ఇతడి ఆలోచన ముందు బిలిగేట్స్ కూడా వేస్టే..
చెట్టు మీద ఇల్లు కట్టు కొవాలని అనుకున్నాడు..అలానే చేసి ఇప్పుడు అందరి చూపును తన వైపు లాక్కున్నాడు.. చెట్టు పైన ఇల్లునా అదేంటి వినడానికి వింతగా వుంది అనుకుంతున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజం.తన పేదరికం తనకూ ఇలాంటి గొప్ప ఆలోచనలకు దారి తీసింది.అతనికి వచ్చిన ఆ కష్టాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము..అతడి పేరు ఫర్మాన్ అలీ.. వయసు 28 ఏళ్లు.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఈ వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా ఓ చెట్టుపై నివసిస్తున్నాడు. చెట్టు మీద తన అవసరాలకు తగ్గట్లు అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అందువల్ల అతడిని చాలా మంది `టార్జాన్ ఆఫ్ కరాచీ` అని పిలుస్తుంటారు.. అతను అంత పేదరికంలో ఉండటం వల్ల అలా చెట్టు మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అందరు అంటున్నారు..అద్దె ఇల్లు తీసుకునేంత స్థోమత నాకు లేదు. అందుకే చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా. వర్షం, చలి నుంచి నన్ను నేను కాపాడుకునేందుకు వెదురు, పాత తలుపు చెక్కలు, దుప్పట్లతో ఓ ఆవాసం ఏర్పాటు చెసుకున్నా.. ఇక్కడి నుంచి నన్ను పంపించ లేదు అని ఆయన అన్నారు..చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన పొట్ట నింపుకుంటున్నాడు.. నిజంగా గ్రేట్ ఐడియా..ఇందుకు సంభందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.