
ఆ మహిళామణి స్ఫూర్తితో.. కోటక్ మహేంద్ర బ్యాంక్ యాడ్ వైరల్?
ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతో వైరల్ గా మారిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో స్ఫూర్తి పొందిన కోటక్ మహేంద్ర బ్యాంక్ యోగితాను స్ఫూర్తిగా తీసుకొని ఒక అడ్వర్టైజ్మెంట్ రూపొందించింది. డ్రైవ్ లైక్ లేడీ అనే పేరుతో సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్ గా మారిపోతుంది. అప్పటి వరకు బస్సు ఎలా నడుపుతారు కూడా తెలియని 42 ఏళ్ల యోగితా బస్సు డ్రైవర్ గా మారిపోయి చాలా మంది ప్రాణాలు కాపాడింది. ఇకపోతే ఇటీవల ఈ అడ్వర్టైజ్మెంట్ ను యు ట్యూబ్ లో విడుదల చేయగా ఇది చూసి మరోసారి నెటిజన్లు యోగితా సాహసాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
కాగా ఈ ఘటన జనవరి 7వ తేదీన జరిగింది అన్న విషయం తెలిసిందే.. యోగితా తో పాటు మరో 20 మంది ప్రయాణికులతో కూడిన మినీ బస్సు పిక్ నిక్ బయలుదేరింది. చూస్తూ చూస్తూ ఉండగానే డ్రైవర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన యోగిత స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తుంది. సకాలంలో బస్సు ఆసుపత్రి దగ్గరికి వెళ్లేలా చేసింది. దీంతో ఆమెపై అందరు ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ఏకంగా 35 కిలోమీటర్ల పాటు ఆ సదరు మహిళ బస్సు నడిపింది అని చెప్పాలి. దీంతో మహిళా దినోత్సవం ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మహిళ యోగిత కు కోటక్ మహేంద్ర బ్యాంక్ అరుదైన గౌరవం వచ్చింది అని అంటున్నారు నెటిజన్లు.