వైరల్: ఆ ఆలయంలో తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్..!!
అయితే ఆ ఆలయాన్ని మరమ్మతులు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అందుచేతనే ఆ ఆలయంలోనే ఉండి ఆ ధ్వజస్తంభాన్ని కాస్త పక్కకు జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ ధ్వజ స్తంభం భారీ ఎత్తున అత్యధిక బరువు ఉండడంతో.. వీటిని జరపడానికి క్రేన్లను ఉపయోగించుకున్నారు ఇక అందుకోసం విజయవాడకు చెందిన క్రేన్ ఆపరేటర్ లతో ముందుగా చర్చలు జరిపించారు. ఇక వారు అంతా వచ్చి ఇక్కడికి పరిశీలించుకుని వెళ్లి ఆ ధ్వజ స్తంభాన్ని పక్కకు జరపడానికి సిద్ధమయ్యారు. దాదాపుగా లక్ష రూపాయల మేర వరకు ఆ క్రేన్ నిర్వాహకులు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నరట.
అయితే 80 టన్నుల బరువు ఎత్తే రెండు పెద్ద క్రేన్లను అక్కడికి తీసుకు రావడం జరిగింది నిర్వాహకులు. అయితే ఈ పనిని ఇంజనీర్ల సహాయంతోనే ఈ ధ్వజ స్తంభాన్ని పక్కకు జరిపి ప్రయత్నాన్ని చేశారు. భూమిలో నుంచి పైకి తీయడంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు ఆపరేటర్లు.. మరింత కాస్త పైకి లేపి ఎత్తుతూ ఉండగా ఒక్కసారిగా ధ్వజస్తంభం పైన భాగం విరిగి కింద పడిపోయింది.. దాంతో అక్కడున్న ప్రజలు అంతా భయభ్రాంతులయ్యారు.. కానీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఊరి ప్రజలు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతోంది.