వామ్మో.. ట్రైన్ లో సీటు సంపాదించడం కోసం ఏం చేసాడో తెలుసా?

praveen
ఎక్కువ మంది ట్రైన్ ప్రయాణాలను ఇష్టపడుతుంటారు. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఇక ట్రైన్ ప్రయాణాలు అతి తక్కువ ఖర్చుతో ఉంటాయి అని భావిస్తూ ఉంటారు. అయితే లోకల్ ట్రైన్స్ లో మాత్రం ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. కాబట్టి ఇక ప్రతి ఒక్కరికి సీటు దొరకడం అది కుదరని పని. కొన్నిసార్లు ప్రయాణికులు ఏకంగా గంటలతరబడి లోకల్ ట్రైన్లో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక ఇలా ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు సీటు దొరికని సమయంలో ఎలాగైనా సీట్ సంపాదించడానికి ఏదో ఒకటి కాస్త విచిత్రంగా ప్రయత్నించడం లాంటివి చేస్తూ ఉంటారు.



 ఇలా ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించడం మాత్రం కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. మరి కొన్నిసార్లు నవ్వులు పూయిస్తు ఉంటుంది. ఇకపోతే ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయింది. రోజు వారి రాకపోకలకు మెట్రో ట్రైన్ ఉపయోగిస్తున్నారు చాలామంది. దీంతో ఇక మెట్రో ట్రైన్ లలో కూడా రద్దీ ఎక్కువగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక ప్రయాణికుడు మెట్రో ట్రైన్ ఎక్కాడు. కానీ అతను మెట్రో ట్రైన్ ఎక్కేసరికి అక్కడ సీట్స్ అన్నీ ఫుల్ అయి పోయాయి. దీంతో ఎలాగైనా సీటు సంపాదించుకోవాలి అనుకున్నాడు సదరు వ్యక్తి.


 దీంతో సీట్ సంపాదించుకోవడం కోసం సరికొత్త ఆలోచన చేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆరోగ్యం బాగాలేదని వాంతులు చేసుకుంటున్నట్లు నటించడం మొదలు పెట్టాడు. దీంతో అతని ముందు సీట్లో కూర్చున్న వారందరూ కూడా దూరంగా వెళ్లిపోయారు. ఇక అందరూ వెళ్ళిపోయారు అని గమనించిన ఆ యువకుడు నటించడం ఆపేసి హాయిగా సీట్లో కూర్చున్నాడు. మొబైల్ చూడటం మొదలుపెట్టాడు. ఇక ఇదంతా చూసి అందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అందరూ నవ్వుకుంటున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: