నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

Divya
ఈ మధ్య కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. ప్రతి ఒక్కరు ఎక్కువగా టూ వీలర్, ఫోర్ వీలర్ వంటి వాహనాలు వాడుతూనే ఉన్నారు.. వీటి వాడకం కారణంగానే కొన్ని పరిస్థితులలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. తాజాగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం లో చేడిమాల వద్ద ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

చేడిమాల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఒక ఆటోను.. వరగలి  క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఢీ కొట్టింది కాక సుమారుగా కొంచెం దూరం ఆటోని లారీ ఈడ్చుకెల్లింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. ఇక అందులో ఉన్న వ్యక్తుల మృతదేహాల చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు అక్కడి స్థానికులు.
మృతుల వివరాల మేరకు.. గూడూరు సొసైటీ ప్రాంతానికి సంబంధించిన ఆటో డ్రైవర్ సుధాకర్.. ఆటోలోనే సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మిగిలిన ఇద్దరూ కూడా లారీ చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిపోయారు. ఈ మృతులు ఇద్దరూ కూడా గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగి రాజశేఖర్‌, హరిసాయిగా అక్కడి స్థానికులు గుర్తించారు. వీరు కూడా ఓ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పని విషయం క్రమంలో సంస్థకు సంబంధించిన సరకులను .. దుకాణాలకు వేసి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మృతుల బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. అంతేకాదు వీరి వాదన చూసి చూసిన వారు కూడా కంటతడి పెట్టుకున్నారు.

ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు దేశంలో ఎక్కడో ఒక చోట రోజు మనం వార్తల్లో వింటూనే ఉంటాం.. ఇక ఇలాంటి మరణాలు చోటుచేసుకోవడం వల్ల అతడిపై ఆధారపడే కుటుంబాలు కూడా అనాధలుగా మారుతాయి.. కాబట్టి వాహన ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా వాహనాలను నడపాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: