వామ్మో : చీర కోసం కొడుకు ప్రాణాలతో చెలగాటం ఆడిన తల్లి వీడియో వైరల్..!!

Divya
సాధారణంగా మహిళలకు చీరలు అంటే ప్రాణం.. ఎంతలా అంటే డబ్బులు లేకపోయినా పక్కవాళ్ళని అప్పు అడిగా అయినా సరే చీరలు కొంటూనే ఉంటారు. అయితే ఇక్కడ ఒక తల్లి చీర కోసం చేసిన పని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. కేవలం వందల రూపాయల విలువ చేసే ఆ చీర కోసం తన కొడుకు ప్రాణాలని పణం గా పెట్టింది ఈ మహాతల్లి.. అయితే ఈ షాకింగ్ హర్యానాలోని ఫరీదాబాద్ లో చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఇంతకు ఏం జరిగింది ..? అసలు విషయం ఏమిటి ..? అనే పూర్తి విషయాలను మనం తెలుసుకుందాం.
ఫరీదాబాద్ లోని ఒక భవనం లో తొమ్మిదవ అంతస్తులో నివాసం ఉంటున్న ఒక మహిళ తమ దుస్తులను ఉతికిన తర్వాత వారి ఇంటి బాల్కనీలో ఆరేసింది.. అయితే బలంగా గాలులు వీచడం తో ఆ మహిళ చీర ఎనిమిదో అంతస్తులోని బాల్కనీ లో పడిపోయింది.. ఆ చీరలు తీయడానికి మహిళ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఇక ఇంతకీ ఆ చీర చేతికి దొరక్కపోవడంతో తన కొడుకును రంగంలోకి దింపింది.. ఇక తన కొడుకు బెడ్ షీట్ సహాయంతో 9 వ అంతస్తు నుంచి 8 వ అంతస్తు లోకి దింపింది.
సాహసంతో ఆ బాలుడు చేసిన పని విజయవంతం అయ్యింది. చీరని తీసుకున్న తర్వాత మళ్లీ అతడిని పైకి లాగడం మొదలు పెట్టింది.. అయితే చివరికి ఈ బాలుడు క్షేమంగా తొమ్మిదవ అంతస్తులోకి చేరుకున్నారు.. ఈ వీడియో కాస్తా సోషల్ మాధ్యమాలలో బాగా  వైరల్ గా మారింది.. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సదరు మహిళ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..అంతే కాదు ఆమె తన కొడుకును ఇలా చేయడం చూసి ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.. కాబట్టి మీరు కూడా ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: