మ్యాచ్ గెలిచారు.. వింత సెలబ్రేషన్.. ముక్కులోంచి రక్తం?

praveen
సాధారణంగా ఏదైనా క్రికెట్ లీగ్లో విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నా తర్వాత ఆటగాళ్లు చేసుకునే సంబరాలు మామూలుగా ఉండవు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితేకొంత మంది ఆటగాళ్లు కాస్త చిత్రవిచిత్రంగా కూడా సంబరాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన బిగ్ బాస్ లీగ్ లో పదకొండవ సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. మొదటి నుంచి వరుసగా విజయాలతో దూసుకుపోతున్న పెర్త్ స్కార్చర్స్ జట్టు ఫైనల్లో కూడా సత్తా చాటింది.



 ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అనే చెప్పాలి. ఫైనల్లో భాగంగా పెర్త్ స్కార్చర్స్ సిడ్నీ సిక్సర్  మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 79 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు  బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చర్స్ జట్టు ఏకంగా నాలుగు సార్లు టైటిల్ను ఎగరేసుకుపోయింది అని చెప్పాలి. ఇప్పుడు మరోసారి విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. మరోసారి తాము దిగ్గజ జట్టు అని నిరూపించుకుంది. ఫైనల్ లో విజయం సాధించిన తర్వాత పెర్త్ స్కార్చర్స్ ఆటగాళ్లు విభిన్న రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని చెప్పాలి. అయితే మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన జై రీఛర్జ్  సన్ కి ఒక వింత అనుభవం ఎదురైంది.



 సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో ఏకంగా రిచర్డ్ సన్  ముక్కులో నుంచి రక్తం కారడం మొదలైంది. ఇక సెలబ్రేషన్స్ తర్వాత రిచర్డ్సన్ ను ఇంటర్వ్యూ చేశాడు బ్రాడ్ హాగ్. ముక్కులో నుంచి రక్తం కారుతుంది ఏమైంది అంటూ అడిగాడు. అయితే మ్యాచ్ విజయం తర్వాత సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్క్వేర్ లెగ్ దిశ నుంచి ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే అతని భుజం నా ముక్కుకి బలంగా తగలడంతో గాయం అయింది. ఇక అప్పటి నుంచి ముక్కు నుంచి రక్తం కారడం మొదలయింది అంటూ జై రిచర్డ్సన్ చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్లో విజయం సాధించిన తర్వాత ఇది కూడా ఒక మెమరీ గా ఉండిపోతుంది అంటూ సరదాగా కామెంట్ చేశాడు రిచార్డ్సన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: