విచిత్రం: కలర్ ను పెళ్లి చేసుకున్న మహిళ...?

MOHAN BABU
అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే వర్ణం గులాబీ. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక మహిళల వార్డ్ రోబ్ గమనిస్తే అందులోని  చీరలు, డ్రెస్ లు ఎక్కువ శాతం పింక్ కలర్ లో ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. దుస్తుల విషయంలోనే కాక షూస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్ కేస్, నెయిల్ పెయింట్, లిప్ స్టిక్ పింక్ పెన్, బెడ్ షీట్.. ఆఖరికి గది గోడల విషయంలోనూ గులాల్ రంగుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతగా మహిళల మనసు దోచుకున్న గులాబీ వర్ణాన్ని కాలిఫోర్నియాకు చెందిన ఓ మగువ మరింతగా ప్రేమించేసింది. ఎంతలా అంటే.. ఆ రంగునే పెళ్ళాడేంత?ఆశ్చర్యంగా ఉంది కదూ..

 ఆ ప్రేమ కథ..పెళ్లి ముచ్చట్లు మనమూ తెలుసుకుందాం. కాలిఫోర్నియాకు చెందిన `కిట్టెన్ కే సెరా ´కొత్త ఏడాది తొలిరోజున లాస్ వెగాస్ లో తనకు ఇష్టమైన పింకు కలర్ ను పెళ్లాడింది. ఈ మేరకు ఒక రంగును వివాహం చేసుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 40 ఏళ్లకు పైగా రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత  పింక్ ను భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్న సెరా..ఈ వేడుకలో గౌను నుంచి లిప్ స్టిక్ వరకు ఆపాదమస్తకం గులాబీ రంగులోనే మెరిసిపోయింది.ఆమె నడిచే దారిలో అంతా గులాబీ పూల రెక్కలతో నిండిపోగా..పెళ్లికి వచ్చిన అతిథులు కూడా పింకు కలర్ అవుట్ ఫిట్స్ ధరించడం విశేషం.

1980 నుంచి గులాబీ వర్ణపు దుస్తులనే ధరిస్తున్నాను.రెండేళ్ల కిందట ఆ రంగు వేసుకున్నందుకు ఓ పిల్లాడు పింక్ ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? అంటూ నాతో తమాషాలు చేశాడు.కానీ నేను ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నాను.జీవితం చాలా చిన్నది. మనం ఇక్కడ ఉండేది కొద్ది సమయం మాత్రమే. ఈలోగానే మనకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా గడపాలి.హావ్ ఏ బ్లాస్ట్. ఈ శుభ సందర్భంలో చనిపోయే రోజు వరకూ గులాబిరంగునే ధరిస్తానని ప్రమాణం చేస్తున్నాను అని సెరా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: