ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే..!

Satvika
పెళ్ళి అంటే మాములుగా పెళ్ళి కూతురు సిగ్గు పడుతుంది.కానీ ఇప్పుడు పెళ్లి ల్లో అమ్మాయిలు మాత్రం ఫోటోల కు పోజులు ఇస్తూ అబ్బాయితో కలిసి దిగుతున్నారు. ఇప్పుడు పెళ్లికూతుళ్లు వారి పెళ్లి బట్టల నుంచి జ్యువెలరీ నుంచి అన్ని వారే స్వయంగా షాపింగ్ చేస్తున్నారు. అంతేకాదు వారి పెళ్లి ఎలా జరగాలో వారే స్వయంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వారి బట్టలను వాళ్ళే కొంటున్నారు.పెళ్లి వేదిక దగ్గరకు డ్యాన్సుల తో ఇరగదీస్తు అద్దిరిపోయే స్టెప్పులు వేసుకుంటు వస్తున్నారు.

పెళ్లిని చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్న నేటి యూత్. అందుకే.. పెళ్లికి ఓ 10 రోజుల ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌ తో పాటు సంగీత్, హల్దీ లాంటి వేడుకలు, డ్యాన్సులు ఇలా పక్కా ప్లాన్ తో అద్దరగొట్టేస్తున్నారు. తమ పెళ్లికి తామే చక్కగా ఎంజాయ్ చేస్తు తాళి కట్టించుకుంటున్నారు. పెళ్ళి కూతురు డ్యాన్స్ చూడటాని కి జనాలు ఆసక్తి  చూపిస్తున్నారు. పెళ్ళి కొడుకు కూడా అదే కోరుకుంటున్నారు.. పెళ్లి కూతుళ్లు తమ డ్యాన్సుల తో పెళ్లికొడుకుల్ని కూడా ఫిదా చేసేస్తున్నారు.

ఇలాంటివి జీవితం లో ఒకసారె జరుగుతాయి..అందుకే ఇలాంటి వాటిని కెమెరాలలొ బంధిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక పెళ్ళి ఇప్పుడు సోషల్ మీడీయా లొ తెగ వైరల్ అవుతుంది..గూర్గావ్‌కు చెందిన సబా కపూర్ అనే పెళ్లి కూతురు అయ్యింది. పెళ్లికి ఎంట్రీ సమయంలో తానే కాకుండా తన కుటుంబ సభ్య అందరితో కలిసి కత్రినా కైఫ్‌, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బార్ బార్ దేఖో సినిమా లోని సా ఆస్‌మానో కో అనే పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టింది. అందరితో డ్యాన్స్ వేస్తూ వచ్చింది. అలా పెళ్లికొడుకు దగ్గరకు చేరుకొని అతడి కి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది... ఇది చూసిన అందరూ వావ్ అంటున్నారు. మీరు కూడా చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: