వావ్ ఏం టెక్నాలజీ గురూ : తల్లి పాలతో నగలు..!!

Divya
సాధారణంగా ఒక మహిళ మాతృత్వం పొందిన తరువాత బిడ్డకు ఇచ్చే చనుబాలు ఎంతటి ఆరోగ్యాన్ని కలిగిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సుమారుగా మొదటి 14 నెలలు తల్లిపాలు బిడ్డకు చాలా అవసరం.. ఇదిలా ఉండగా ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి రెండూ ఉంటాయి.. అయితే ఆనందంగా ఉన్నప్పుడు ఆ క్షణాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడానికి గుర్తుగా కొన్నింటిని దాచుకుంటూ ఉంటాం. ఇక ఇలాంటి క్రమంలోని ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఆ బిడ్డకు ఇచ్చే ఫీడింగ్ జర్నీ అయిపోయేలా ఉంది అని భావించింది.. ఆ బిడ్డకు సుమారుగా 18 నెలల పాటు ఫీడింగ్ చేసింది.

అంతేకాదు ఈ జర్నీలో ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంది.. బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో సిజరిన్ కూడా జరిగింది.. అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత బిడ్డకు పాలివ్వడం కష్టంగా అనిపించినా బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె బ్రెస్ట్ ఫీడింగ్ చేసింది.. అన్ని కష్టాలను ఎదుర్కొని బిడ్డకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసి ఆ జర్నీ ముగిసిపోతోంది.. ఇది ఎప్పటికైనా గుర్తుండేలా ఒక చెరగని తీపిగుర్తు గా ఉంచుకోవాలని ఆలోచించింది ఆ తల్లి.. ఇక ఒకరోజు సోషల్ మీడియా చూస్తూ ఉండగా అనుకోకుండా పేరెంటింగ్ గ్రూప్ ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒకటి వైట్ స్టోన్ ఆకారంలో పెండెంట్ కనిపించింది..
అయితే ఆ స్టోన్ ఎవరో తల్లిపాలతో తయారుచేసి మార్కెట్ లో ఉంచారు.. ఆ తల్లి కూడా బ్రెస్ట్ మిల్క్ తో జువెలరీ చేయాలని ఆలోచించింది.. తల్లిపాలతో తయారుచేసే జ్యువలరీ మార్కెట్ ను అప్రోచ్ అయి తను ఏమనుకుంటుందో తనకు జీవితాంతం గుర్తుండిపోయే గా అందరూ ఇష్టపడే లాగా ఏదైనా ఒక నగను తయారు చేయాలని వారితో చెప్పింది.. సాధారణంగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఒక ఆర్గానిక్ పదార్థం కాబట్టి దీనిని జ్యువెలరీ కింద మార్చడం చాలా కష్టం. అయితే ఆ మహిళ పెండెంట్ కోసం 10 మిల్లీ లీటర్ల తన పాలను తీసుకొని ఆ పేరెంటింగ్ కంపెనీకి పంపించింది.. ఎంతో అద్భుతంగా మిల్కీవైట్ హార్ట్ పెండెంట్ రూపంలో తయారు చేసి ఆమెకు మెయిల్ పంపించారు. దీనిని ముత్యంలాగ మార్చడానికి వారు పాలను డ్రై చేసి కెమికల్స్ ఉపయోగించి అందమైన పెండెంట్ తయారు చేశారు..ఇక దానిని చూసిన తల్లి ఆనందానికి అవధులు లేవు అని చెప్పాలి. ఇది చూసిన వారు టెక్నాలజీ కి ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: