ఎక్సర్సైజ్ చేస్తూనే తినే రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా..!

MOHAN BABU
నాన్ వెజ్,బేకరీ,ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ తింటే బరువు పెరుగుతామని తెలుసు. కానీ తినకుండా కంట్రోల్ చేసుకోలేము.ఎంత స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతున్న వీకెండ్స్ లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో బయటికి వెళ్తే అంతే సంగతులు.. నోరురించే వెరైటీలు కనపడగానే టెంప్ట్ అయిపోయి తినేస్తాం. అయితే చైనాలోని మెక్ డోనాల్డ్స్ నిర్వాహకులు ఈ సమస్య కు అద్భుత పరిష్కారాన్ని చూపించడం తో కస్టమర్ క్యూ కడుతున్నారు. పుష్టిగా తింటూనే తమ కేలరీలను బర్న్ చేసుకోగలిగే సొల్యూషన్ ఏంటో మీరూ తెలుసుకోండి. వ్యాయామాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా మెక్ డోనాల్డ్స్ నిర్వాహకులు సాధారణ టేబుల్ సీట్లను స్టేషనరీ  బైక్స్ తో భర్తీ చేశారు.కస్టమర్స్ ఫుడ్ లాగిస్తూనే కేలరీలను తగ్గించుకునేందుకు వీలుగా సైకిల్ తొక్కాల్సి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే పవర్ తో కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్స్ రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం గ్యాంగ్ డాంగ్,షాంఘయ్ లోని రెండు మెక్ డోనాల్డ్స్ రెస్టా రెంట్లలో అలాంటి 10 గ్రీన్ చార్జింగ్ బైక్స్ అందు బాటులో ఉండగా వీటిని రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారు చేయడం విశేషం. ఫుడ్ ఆస్వాదిస్తూ ఎక్సర్ సైజ్ చేస్తున్న మెక్ డోనాల్డ్స్ కస్టమర్స్ వీడియోలు ప్రస్తుతం టిక్ టాక్ లో వైరల్ గా మారాయి.

మెక్ డోనాల్డ్స్ తయారు చేసిన ఈ ప్రయోగాన్ని పలువురు అభినందిస్తుండగా,విమర్శలు కూడా వస్తున్నాయి.జీర్ణక్రియకు ఇది గొప్ప కాన్సెప్ట్ కాదు,తినేటప్పుడు శారీరక శ్రమలు చేయవద్దు. తినడానికి రిలాక్స్డ్ స్థితి అవసరం కాబట్టి అది జీఐ ట్రాక్ట్ ద్వారా బాగా జీర్ణం అవుతుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అరగంట పాటు సైకిల్ తొక్కితే 252 కేలరీలు బర్న్ అవుతాయని,ఓ బిగ్ మ్యాక్ లో 550 కేలరీలు ఉంటాయి కాబట్టి మీరు గంటకు పైగా వ్యాయామం చేయాల్సి ఉంటుందని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: