స్టూడెంట్స్ కు బాడీగార్డ్ గా కొండముచ్చు..ఎక్కడంటే?
ఆ జంతువు మిగిలిన వాటి నుంచి కాపాడుతుంది.. దెబ్బకు హీరో అయ్యింది. ఈ వింత తెలంగాణా లో వెలుగు చూసింది. తెలంగాణా లొని జగిత్యాల జిల్లా లోని మల్యాల మండలం లో ఉన్న తాటి పల్లి అనే గ్రామంలో చోటు చేసుకుంది.. ఆ గ్రామంలో కోతుల దాడి ఎక్కువగా ఉంది. ఒకవైపు పంటలను వదలడం లేదు. మరోవైపు ఇళ్ళ ల్లోకి దూరి దొరికిన కాడికి నాశనం చేసి తింతున్నాయి. బయట ఎవరైనా తిరిగితే వారి పై ఎదురు దాడి చేస్తున్నాయి.
ముఖ్యంగా స్కూల్ కు వెళ్ళే పిల్లల పై దాడి చేస్తున్నాయి. దీంతో స్కూల్ యాజమాన్యం భయపడ్డారు. ఆ తర్వాత ఒక గొప్ప ఆలోచన చేశారు.కోతులను కంట్రోల్ చేయాలంటే కొండముచ్చునే కరెక్ట్ అని భావించి, దానిని తీసు కొచ్చి స్కూల్ గ్రౌండ్ లో కట్టేశారు. అంతే మారుతి ల సంచారం పూర్తిగా తగ్గింది. ఇప్పుదు పిల్లలు చక్కగా స్కూల్ కు వెళ్తున్నారు. అయితే గ్రామం లో మాత్రం కోతులు వీరంగం చేస్తున్నాయి.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లారు.. వారు వచ్చి కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంథాన్ని చూసి వెళ్లారు. స్థానికులు మాత్రం ఎప్పుడూ ఎవరి మీద దాడి చెస్తాయో అని బెంబెలెత్తి పోతున్నారు.. ఏది ఏమైనా ఇలా కొండముచ్చు ఆ పిల్లలకు అండగా నీలవడం గ్రేట్.. ఈ వార్త వైరల్ అవ్వడం తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. కామెంట్ల వర్షం తో భలే ట్రెండ్ అవుతుంది.