ఐస్ క్రీమ్ సెల్లర్ అంతిమయాత్ర.. ఎలా జరిగిందో చూడండి?
సాధారణంగా ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తిని కాస్త తక్కువగానే చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఏదో వారి సంపాదన మీదే ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి బతుకుతున్నాడు అన్నట్లుగా ఒక ఐస్ క్రీమ్ కొనుగోలు చేసి ఫీలవుతూ ఉంటారు. అలాంటిది ఒక ఐస్క్రీమ్ అమ్మే వ్యక్తి చనిపోతే ఎవరైనా పట్టించుకుంటారా. దాదాపు ఎవరూ పట్టించుకోరు. కేవలం కుటుంబ సభ్యులు బంధువులు మాత్రమే అతని కోసం బాధపడుతూ ఇక అంతిమయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఐస్క్రీమ్ అమ్ముకునే వ్యక్తి చనిపోతే ఎవరో ప్రముఖ వ్యక్తి చనిపోయినట్లు అతని అంతిమ యాత్ర నిర్వహించారు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన ఆగ్నేయ లండన్ లో వెలుగులోకి వచ్చింది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఐస్ క్రీమ్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు 62 ఏళ్ల హాసన్ దెర్విష్ అనే వ్యక్తి. ఇటీవలే అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. ఇక ఒక ఐస్క్రీమ్ అమ్ముకునే వ్యక్తి అంతిమ యాత్ర ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుపోయింది అని చెప్పాలి. అతని అంతిమ యాత్రకు ఎన్నో ఐస్క్రీం ట్రక్కులు ఊరేగింపుగా వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.