ఏం చేసినా అధిక బరువు తగ్గటం లేదా.. అయితే ఈ టెస్ట్ తప్పనిసరి..!!

Divya
ఈ మధ్య కాలంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఊబకాయం అని చెప్పవచ్చు. అధిక బరువు వల్ల మనిషి ఏ పనులను సవ్యంగా చేసుకోలేక పోవడమే కాకుండా చూడడానికి అందవిహీనంగా కూడా కనిపిస్తూ ఉంటారు.. శరీరంలో ఎక్కువగా కొవ్వు శాతం పేరుకొని పోవటం వల్ల అవయవాల పనితీరుకు కూడా ఆటంకం కలిగి, క్రమంగా ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తుంది.. ఇక మీరు కూడా అకారణంగా బరువు పెరుగుతున్నారా..?ఇక రోజు రోజుకు శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గిపోతోందా..? జీర్ణక్రియ కూడా సరిగా జరగడం లేదా..? అయితే మీరు బరువు తగ్గడంలో చేసే ప్రయత్నాలలో ఎలాంటి లోపం లేదు.. అంటే మీ శరీరంలోని పేగులలో ఉండే కొన్ని సూక్ష్మ జీవులే మీరు మరింత బరువు పెరగడానికి దోహదపడుతున్నాయి...

వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ.. మనం తిన్న ఆహారం శోషించుకోవడం లో పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు ముఖ్యమైన కీలక పాత్రను పోషిస్తాయి. వీటినే మైక్రో బయోమ్ అని కూడా అంటారు.. ఈ మైక్రో బయోమ్ లో వచ్చే తేడాల వల్ల ఊబకాయం పెరిగిపోతోంది.. అని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మన శరీరంలోని పేగులలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇక వైద్యులు చేసే కొన్ని పరీక్షల వల్ల వారు ఈ సూక్ష్మ జీవులను గుర్తించగలరు.. వైద్యుల చేసే ఈ పరీక్షల వల్ల మీరు బరువు తగ్గడం లాంటివి సహాయ పడకపోవచ్చు కానీ తప్పనిసరిగా అయితే మీరు మైక్రో బయోమ్ అనేది తప్పకుండా చేయించుకోవాలి..
ఎందుకంటే ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల శరీరంలో సూక్ష్మజీవుల శాతాన్ని తగ్గించే కొన్ని తక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా లభిస్తుంది.. ముఖ్యంగా శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఈ మైక్రో బయోమ్ కి ఉండాలి కాబట్టి తక్కువ మోతాదులో ఉంటే శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడుతున్నారా అయితే వెంటనే ఈ మైక్రో బయోమ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: