బిల్గేట్స్ కి అందుకే వార్నింగ్ ఇచ్చారా ..మరీ మనవాడుఅంత చిలిపా ??
తాజాగా మనోడి చిలిపి చేష్టలను ఓ మిడిల్ రేంజ్ ఉద్యోగి బయటపెట్టింది. ఈ ఘటన 2008 లో జరగగా ప్రస్తుతం వెలుగు చూసింది. ఓ మిడిల్ రేంజ్ ఉద్యోగి తో బిల్గేట్స్ మెయిల్స్ ద్వారా పులిహోర కలిపిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. అయితే ఆ ఉద్యోగిని జనరల్ కౌన్సెల్ బ్రాడ్ స్మిత్, మరి కొందరు ఎగ్జిక్యూటివ్స్ కి ఈ విషయాన్నీ తెలుపగా వారు బిల్ గేట్స్ ని వ్యక్తిగతంగా కలిసి ఈ విషయమై హెచ్చరించారు .ఇలాంటి విషయాలు మల్లి జరిగితే మంచిది కాదని సున్నితంగా మందలించారు కూడా. అయితే ఈ విషయం లో బిల్గేట్స్ నీళ్లు నమిలాడట. ఆమెకు కేవలం వెకిలి మెయిల్స్ పంపడం. ఈ పులిహోర విషయం శారీరక సంబంధం దాకా వెళ్లకపోవడంతో తనని మందలించి వదిలేసారు. ఈ విషయాన్నీ వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొన్నారు . ఈ విషయమై గేట్స్ గాని స్మిత్ లు ఏమి స్పందించ లేదు. అయితే గేట్స్ కార్యాలయం మాత్రం ఈ విషయాన్నీ ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ విషయాలన్నీ వెల్లడించడం లో వారికీ స్వలాభం చేకూరుతు ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది