కాంగ్రెస్ పై అక్కసుకు కారణమేంటి కిశోర్ ?

Vennelakanti Sreedhar
కాంగ్రెస్ పై  అక్కసుకు  కారణమేంటి కిశోర్ ?


భారత్ లో అతను ఎం చేసినా వార్తే.. అతని పలుకులు, గమనాగమనాలను నిత్యం వేలాది మంది గమనిస్తుంటారు.  ఇక అతను సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల గురించి వేరే చెప్పనక్కర లేదు. అతనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. భారత దేశంలో ఇటీవలి కాలంలో  నిత్యం వార్తల్లో ఉండే ఎన్నికల వ్యూహ  కర్త.  తమిళనాడులో అధికార పగ్గాలు చేపట్టిన డి.ఎం.కే పార్టీకి,  పశ్చిన బంగాల్ లో విజయ బావుటా ఎగుర వేసిన తృణముల్ కాంగ్రెస్ పార్టీకి ఏక కాలంలో ఎన్నికల మంత్రాంగం నడిపిన వ్యక్తి.    సైద్దాంతిక విబేధాలున్న వివిధ పార్టీల తరఫున ఏక కాలంలో పని చేసి , వారికి విజయం చేకూర్చి పెట్టిన ఘనత ఈయనది.
గత కొద్ది నెలలుగా  ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్  పార్టీతో జత కడుతున్నాడని,  రానున్న ఎన్నికలలో  కాంగ్రెస్  విజయానికి తన బృందంతో కృషి చేస్తాడని వార్తలు వెల్లువెత్తుతున్నయి. ఈ నే పథ్యంలో ఆయన కాంగ్రెస్ పై చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. ఇది సామాన్య ప్రజానీకానికే కాక, యావత్ రాజకీయ రంగం పై కూడా ప్రభావం చూపుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఘటనను ప్రశాంత్ కిశోర్ సామాజిక మాద్యమాలలో ప్రస్తావించారు. ఓజిసిలో చాలా కాలంగా మరుగున పడిన సమస్యలున్నాయి.  నిర్మాణాత్మకమైన లోపాల పై రాజకీయవేత్తలు దృష్టి సారించాలి. పరిష్కార మార్గాలను ఆలోచించాలి   అని ప్రశాంత్ కిశోర్ పేర్కోన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు తనను  నిరాశపర్చిందని తెలిపారు. అంతే కాదు కాంగ్రెస్  గ్రాండ్ ఓల్ట్ పార్టీ   అని ఆక్షేపించారు. కాంగ్రెప్ పార్టీ తీరును తననే కాకుండా  స్థానిక ప్రజలను కూడా నిరాశకు గురి చేసిందని ప్రశాంత్ కిషోర్  పేర్కోన్నారు.
రానున్న కొద్ది నెలల్లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉబలాట పడుతున్న కాంగ్రెస్ పార్డికి  ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు మింగుడు పడలేదు. దీనిపై వ్యాఖ్యానించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరూ సుముఖత వ్యక్తం చేయలేదు. ఉత్తర  ప్రదేశ్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోనేందుకు లఖింపూర్ ఘటనను  వాడుకోవాలని జూసిన కాంగ్రెస్  పార్టీ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలతో దూకుడు ని తగ్గించింది. కర్షకులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుపుతున్న నిరసన కార్యక్రమం పై కేంద్ర మంత్రి కుమారుడి దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు  ఈ కేసును సుమోటో గా స్వీకరించింది కూడా. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రాలు లఖింపూర్ వెళ్లి బాధితుల్ని పరామర్శించి వచ్చారు కూడా.  ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వెడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: