జేసీబీలో వధువరుల ఊరేగింపు..హంజా జంట వెరైటీ పెళ్లి!

Surya
పెళ్లంటే నూరేళ్ళ పంట . పెళ్లిచేసి పెద్దలు వధువు వరుల జీవితంలో మరచిపోలేని విధంగా, జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లిళ్లు చేసి వారికీ కానుకగా ఇస్తారు. అదేవిధంగా పెళ్లి చేసుకోబోయే జంట కూడా పెళ్లిని హుందాగా చేసుకుందాం అనుకుంటారు. ప్రస్తుతం పాకిస్తాన్కి చెందిన ఈ యువ జంట ఇలానే చేసారు. పెళ్లికి వచ్చిన వారంతా వధువరులు  ఏ గుర్రం పైనో లేక టాప్ లెస్ కారులోనో  వస్తారని అనుకుంటారు కానీ వాళ్లందరికీ జేసీబీ లో వచ్చి షాక్ ఇచ్చారు. 


వధువరులు జేసీబీ లో ఊరంతా తిరిగి అందరిని ఆశ్చర్యపరచారు. వివరాలలోకి వెళితే పాకిస్తాన్ లోని హంజా లోయ ప్రాంతానికి చెందిన గులాం దస్తగిర్ అనే యువకుడు ఓ జేసీబీ డ్రైవర్. 
అతడు తన వృత్తిని గౌరవించే వాడు. అయితే ఈ విషయాన్నీ తెలుసుకున్న వధువు జేసీబీ లో బారాత్ కార్యక్రమాన్ని చేయాలనీ వరుడు దస్తగిర్ ని ఒప్పించింది. వధువు కోరికని వరుడు గౌరవించి జేసీబీ లో బారాత్ చేయడాని కి ఒప్పుకున్నాడు. ఆ జేసీబీ లో వధువును ఊరంతా ఊరేగించారు దస్తగిర్. ఇదిలా ఉండగా హుంజా మేజిస్ట్రేట్ వరుడు గులాం దస్తగిర్ కి సమన్లు జారీచేసింది. 



జేసీబీ పై వధువు ఊరేగింపు చట్టరీత్య నేరంగా చెప్పి దీనికి వివరణ ఇవ్వాలని అతడికి సమన్లు జరీ చేసింది. MVO  1965 , సక్షన్ 257 PPC ల  క్రింద కేసు నమోదు చేసారు.4th oct ఉదయం 10 గంటలకల్లా వివరణ ఇవ్వాలని కోరారు హుంజా మేజిస్ట్రేట్ అధికారులు . అయితే పలువురు దస్తగిర్ చేసిన ఈ సాహసాన్ని కొనియాడుతున్నారు . ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. అయితే గతం లో వరంగల్ కి చెందిన ఓ పెళ్లి జంట కూడా ఈ విధంగానే జేసీబీ పై బారాత్ చేసుకుని ఆశ్చర్య  పరచారు. అప్పట్లో ఆ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్త తెగ వైరల్ కూడా అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: