వైరల్: త్వరలో భూమికి ముంచుకొస్తున్న ప్రమాదం.. హెచ్చరిస్తున్న ఐక్యరాజ్యసమితి..!

Divya
ఈ మధ్యకాలంలో కరోనా రావడం వల్ల, ప్రతి ఒక్కరు ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇక దాంతో పర్యావరణం ఎంతో ఆహ్లాదంగా ఉన్నది. ఇక నదులలోని ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు కూడా కొట్టుకొని పోయాయి. ఇలా సంవత్సరంలో కేవలం ఒక నెల రోజులపాటు ఇలా చేసినా బాగుంటుంది అన్నట్లుగా అప్పట్లో ఎక్కువగా కామెంట్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం భూమి గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. ఆ వివరాలను చూద్దాం.

UAN ఫ్రేమ్ వర్క్ కన్వెక్షన్.. వారు భూ పాతానికి సంబంధించిన కొన్ని తాజా నివేదికలను విడుదల చేయడం జరిగింది. వారు తెలిపిన ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరుగుతాయ్ అన్నట్లుగా హెచ్చరిస్తున్నది. అయితే భూ పాతాన్ని తగ్గించాలంటే మటుకు మన చుట్టూ ఉండే ఉష్ణోగ్రత సగటు..1.5 డిగ్రీల లోపు ఉండాలట.

కానీ ఇలా లేకపోవడం వల్ల.. భూమి మహా విపత్తువైపు చాలా వేగంగా దూసుకుపోతోందని ఐక్యరాజ్యసమితిలోని సెక్రటేరియల్ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలియజేశారు. ఇక మన చుట్టూ ఉండే ఉష్ణోగ్రతలు..2.7 డిగ్రీల పెరగడం అంటే అది ఎన్నో విపత్తులకు దారితీస్తుంది అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇక వీటిని 1.5 డిగ్రీల దగ్గరే పెరగనీయకుండా ఉష్ణోగ్రతలను ఉంచుతామని ఆరు సంవత్సరాల కిందటి ప్యారిస్ ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ ఆ హామీ గాల్లో కలిసి పోయినట్టే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐక్యరాజ్యసమితి సభ్యులు.
ఇక ఈ విపత్తు జరగకుండా ఉండాలి అంటే ఉష్ణోగ్రతలు..1.5 డిగ్రీలు ఉండేవిధంగా చూసుకో లేకపోతే భూమి మీద జీవరాశి వినాశనానికి దారితీస్తుంది అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి మన దగ్గర అన్ని ఆయుధాలు సమకూర్చుకున్నప్పటికీ దాని కంటే వేగంగా సమయం ముందుకు వెళుతోందని తెలియజేశారు. ఏది ఏమైనా ఉష్ణోగ్రతను తగ్గించడం కోసం మనం  మన చుట్టూ కాలుష్యం వంటివి నివారించడం మంచిదని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: