అబ్బాయికి డిగ్రీ లేదని నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయి... ?

VAMSI
ఎక్కడ జరగని ఒక విచిత్రం ఒక యువకుడి విషయంలో జరగడం అందరినీ ఎంతగానో ఆశర్యపరుస్తోంది. ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకుని ఇక నిశ్చితార్ధం పెళ్లి జరగడమే తరువాయి. కానీ సదరు యువతీ ఈ పెళ్ళికి నిరాకరించింది. కారణంగా తెలుసుకుని అందరూ ముక్కునవేలేసుకున్నారు. అయితే అసలు ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో నిన్న జరిగిన సంఘటనగా తెలుస్తోంది. ఈ గ్రామంలో ఉన్న అమ్మాయికి మరియు ఈర్లపుడి లోని భాగ్యా తండాకు చెందిన ఇక్బల్ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. కానీ పెళ్లి చూపుల సమయంలో అందరూ మాట్లాడుకున్న విధంగానే అబ్బాయి చదువు సంధ్యల గురించి అడగడం, అబ్బాయి ఇంటి వారు మా అబ్బాయి ఇక్బల్ డిగ్రీ పూర్తి చేశాడని చెప్పారట.
ఇదంతా నమ్మి యువతికి చెప్పడంతో ఆమె కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. నిన్న అనగా ఆదివారం రోజున ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్ధం చెయ్యాలని అనుకున్నారు. అమ్మాయి ఇంటి దగ్గరే దీనికి సంబంధించిన ఆణి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాగో అమ్మాయి బంధువులకు ఇక్బల్ డిగ్రీ చదవలేదని తెలిసిపోయింది. అంతే కాకుండా ఈ విషయం అమ్మాయి వరకు వెళ్ళింది. ఈ కారణంతో సరిగ్గా నిశ్చితార్ధం రోజున పెద్దలందరి సమక్షంలో ఈ అబ్బాయి అబద్దం చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడు. డిగ్రీ కూడా చదవని ఈ అబ్బాయిని పెళ్లిచేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పింది.
తమను మోసం చేశారని ఇరు కుటుంబీకులు ఘర్షణ పడడంతో వారిలో ఒకరికి గాయాలయినట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న వైరా మండల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  చూశారా వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ ఇక్కడ వీరు ఆడిన ఒక అబద్దానికి పెళ్లి కాస్తా పెటాకులయింది. పైగా బోనస్ గా కేస్ ఫైల్ అయింది. కాబట్టి ఇది అభివృద్ధి చెందుతున్న దేశం ఇక మోసగాళ్ల ఆటలు సాగవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: