వైరల్ వీడియో : ఢిల్లీ వీధుల్లో పడవ ప్రయాణం?

praveen
ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో కనీసం వర్షపు చినుకు కూడా లేకపోవడంతో వర్షాలు పడాలని ప్రజలందరూ పూజలు చేస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని ప్రాంతాలు కూడా జలమయం అయిపోతున్నాయి. దీంతో జనావాసాల్లోకి నీళ్లు వచ్చి ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రహదారులు అన్ని పెద్ద పెద్ద చెరువులను తలపిస్తు ఉండటం గమనార్హం. అయితే ఇలా భారీగా వర్షాలు పడినప్పుడు లోతట్టు ప్రాంతాలతో పాటు అటు రహదారులు కూడా పూర్తిగా వరద నీటితో నిండి పోయి పెద్ద పెద్ద చెరువులను తలపిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇదే అదునుగా భావిస్తూ ఉంటాయ్ ప్రతిపక్ష పార్టీలు.  వరదలు వచ్చిన సమయంలో ఆ వరదలను  ఉద్దేశిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కేవలం విమర్శలతో  సరిపెట్టుకోకుండా వినూత్నంగా ప్రజల ఇబ్బందులను తెలియజేసేందుకు నిరసనను తెలుపడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు   ఇక్కడ ఒక బీజేపీ నేత చేసిన నిరసన కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. సాధారణంగా పడవ ప్రయాణం చేయాలి అంటే ఎక్కువగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతూ ఉంటారు అందరు. కానీ ఇక్కడ బిజెపి నేత మాత్రం రహదారిపై నిలిచిపోయిన వరద నీటిలో పడవ ప్రయాణం చేసి నిరసన తెలిపారు.

 దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో హాల్ చల్ చేస్తూ ఎంతోమందిని అవాక్కయ్యేలా చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయిపోయాయి  ఈ క్రమంలోనే వరదలపై బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ వినూత్నమైన నిరసన తెలిపి హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఢిల్లీ వీధుల్లో భారీగా నిలిచిపోయిన వరద నీటిపై పడవ ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పడవ ప్రయాణం కోసం నేను రిషికేశ్ వెళ్దాం అని అనుకున్నా.. కానీ లాక్ డౌన్ కారణంగా వెళ్ళలేకపోయాను.. ఇక ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే పడవ ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు. థాంక్యూ కేజ్రీవాల్ జీ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: