సాధారణంగా బెండకాయ ఆకుపచ్చ రంగులో ఉంటుందని మనందరికీ తెలుసు.అది వివిధ రంగులు లేదా ఆకృతులలో వచ్చే ఇతర కూరగాయలు లేదా పండ్ల వలె కాకుండా ఒకే రంగులో ఉంటుంది.కానీ మధ్యప్రదేశ్‌లో ఒక రైతు, శ్రీశ్రీలాల్ రాజ్‌పుత్ తన తోటలో ఎర్రటి బెండకాయను పెంచుతున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం అతను భోపాల్ జిల్లాలోని ఖజురి కలాన్ ప్రాంతానికి చెందినవాడు. ఈ బెండకాయ గురించి అడిగినప్పుడు, రైతు దాని ప్రయోజనాల గురించి మాట్లాడారు. "నేను పెంచే ఈ బెండకాయ సాధారణ ఆకుపచ్చ రంగుకు బదులుగా ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఆకుపచ్చ బెండకాయ కంటే కూడా ఎక్కువ ప్రయోజనకరమైనది ఇంకా పోషకమైనది. ఇది గుండె,రక్తపోటు సమస్యలు, మధుమేహం ఇంకా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరం" అని ఆ రైతు చెప్పారు.
దీని సాగు ప్రక్రియ గురించి అడిగినప్పుడు, "నేను వారణాసిలోని ఒక వ్యవసాయ పరిశోధన సంస్థ నుండి 1 కిలోల విత్తనాలను కొనుగోలు చేసాను. నేను వాటిని జూలై మొదటి వారంలో పొలంలో నాటాను. సుమారు 40 రోజుల్లో, అది పెరగడం ప్రారంభమైంది." ఇక ఈ బెండకాయ సాగు ప్రక్రియలో తాను ఎలాంటి హానికరమైన పురుగుమందులను ఉపయోగించలేదని కూడా ఆయన చెప్పారు.ఇక రాజ్‌పుత్ వివరాల ప్రకారం, ఎకరా భూమిలో కనీసం 40-50 క్వింటాళ్లు ఇంకా గరిష్టంగా 70-80 క్వింటాళ్లు పండించవచ్చు. ఈ ఉత్పత్తికి సంబంధించి లాభాల విషయానికొస్తే, రాజ్‌పుత్ దాని మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. "ఈ బెండకాయ సాధారణ లేడీ ఫింగర్ల కంటే 5-7 రెట్లు ఎక్కువ ఖరీదైనది. ఇది కొన్ని మాల్స్‌లో 250 గ్రాముల/500 గ్రాములకు రూ.75-80 నుండి రూ.300-400 వరకు కూడా అమ్ముడవుతోంది."అని చెప్పాడు. ఇంకెందుకు ఆలస్యం సంపూర్ణ ఆరోగ్యం కోరుకునే వారు వెంటనే ఈ ఎర్ర బెండకాయని కొనుగోలు చెయ్యండి.షుగర్, గుండె జబ్బులు ఇంకా రక్త పోటు సమస్యలను పోగొట్టుకొని సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.