వైరల్ : రంగులు మార్చే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా ..?

Divya
వింత అనేది ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు మాత్రమే కాదు .. విశ్వంలో ఎన్నో వింతలు, తెలియని విశేషాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా భారతావనిలో ఈ వింతలు, విశేషాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . కోటానుకోట్ల వింతలు, విశేషాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు , పరిశోధకులు కూడా చేదించలేని రహస్యాలు.. రహస్యాలు గానే మిగిలి పోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కేరళలో ఉన్న అనంత పద్మ స్వామి దేవాలయం కింద ఉన్న గదులు అన్నింటినీ తెరిచి నప్పటికీ, ఆరవ గది తలుపులు మాత్రం తెరవలేకపోతున్నారు. ఆ ఆరవ గదికి నాగబంధం ఉందట. ఈ నాగబంధం ఉన్న గదిని తెరవడానికి ఏ ఒక్కరు కూడా సాహసించలేదు. ఎంతో పరిజ్ఞానం పొందిన సైన్స్ కూడా ఈ నాగబంధాన్ని విడదీయ లేకపోతోంది అంటే, హేతువాదులు కూడా దైవం ఉందని నమ్మక తప్పదు.

సైన్స్ ఆలోచనలకు కూడా తట్టని ఎన్నో రహస్యాలు, ఈ అనంత విశ్వంలో ,కోటానుకోట్ల లో ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత రహస్యం తో కూడుకున్న శివాలయం కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఆ శివాలయం ఏదో కాదు అచలేశ్వర్ మహదేవ్ ఆలయం.. ఈ ఆలయం యొక్క విశిష్టతను, ఈ ఆలయంలో ఉన్న ఈ వింతను మాత్రమే తెలుసుకుందాం..ఇక ఆ రహస్యాన్ని పరిశోధకులు కూడా చేయించలేక పోతున్నారు.

ఈ ఆలయం రాజస్థాన్ లోని హీరోని జిల్లాలో తోల్పూర్ ప్రాంతంలో ఉన్న అచలేశ్వర్ మహాదేవ ఆలయం. సాధారణంగా శివలింగం అనగానే మనం చల్లని మంచి రూపంలోనూ , లేక నల్ల రాతి రూపంలోనూ చూస్తూ ఉంటాం.. కానీ ఈ దేవాలయంలో పరమ శివుడు లింగం మాత్రం రోజుకు మూడు రంగులు మారుస్తూ ఉంటుంది.. తెలిసిన వారికి పక్కనబెడితే, తెలియని వారికి ఇది ఒక పెద్ద వింత అని చెప్పవచ్చు. శివలింగం ఏమిటి ..?రంగులు మార్చడం ఏమిటి..? అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ శివలింగం పై ఎన్నో పరిశోధనలు చేసిన పరిశోధకులు కూడా రహస్యాన్ని ఛేదించ లేకపోతున్నారు.
ఉదయం పూట ఈ శివలింగం ఎర్రగా కనిపిస్తే , ఇక మధ్యాహ్న సమయంలో కాషాయం రంగులో కనిపిస్తుందట. సాధారణంగా సాయంత్రం పూట నల్లని రూపంలోకి మారుతుంది.. అని కొంతమంది పరిశోధకులు తేల్చడం జరిగింది. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు వేలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు  వస్తూనే ఉంటారు. ఈ శివాలయంలో పరమశివుడు స్వయంభూగా వెలిశాడు అని అక్కడ ప్రజల నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: