ఆ దేశంలో కొవిడ్ - 19 టీకాతో ఇద్దరు వ్యక్తులు మృతి..!
జపాన్ లోని దేశీయ మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి టకెడా ఫార్మాస్యూటికల్ తయారుచేసిన మోడెర్నా టీకా రెండో టీకా వేసుకున్న తర్వాత రెండు రోజులు జ్వరంతో బాధపడి , తర్వాత ఆ వ్యక్తులు మరణించినట్టు నివేదికలు తెలిపాయి. ఇక ఇప్పటికే కొన్ని సీసాలలో ఉన్న టీకా మందు కాలుష్యం అయిందని నివేదికలు వచ్చిన వారం రోజుల తర్వాత, జపాన్ దేశం మొత్తం 1.63 మిలియన్ డోస్ మోడెర్నా ఇంక్ యొక్క కరోనావైరస్ వ్యాక్సిన్‌ల వాడకాన్ని నిలిపివేసింది..
ఆ వ్యక్తులు మరణించడంతో ఆ సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేరవేశారట అక్కడున్న అధికారులు. ఇక దీంతో ఈ వ్యాక్సిన్ తయారీని నిలిపివేయాలని జపాన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఇద్దరు వ్యక్తులకు మెడర్నా టీకాల తో టీకా వేసిన అతి తక్కువ రోజుల్లోనే ఇద్దరు యువకులు మరణించినట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అంతేకాదు ఈ ఫార్మా మెడిసిన్ ల్యాబ్ లో పనిచేస్తున్న కొంత మందిని గురువారం సస్పెండ్ కూడా చేశారు.
ఈ చనిపోయిన వ్యక్తుల శరీరంపై పూర్తిగా పరీక్షలు చేస్తున్నట్లు, చనిపోవడానికి గల సరైన కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టకెడా తెలిపిన వివరాల మేరకు తమ టీకా వల్లే ఆ ఇద్దరు యువకులు చనిపోయారు అన్న ఎలాంటి స్పష్టత లేదని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నట్లు అధికారులు తెలిపారు.