ప్రజెంట్ ప్రతీ ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ కంపల్సరీగా ఉంటోంది. దాంతో చాలా మంది ఫొటోలు, సెల్ఫీవీడియోలు తీసుకుంటున్నారు. ఇకపోతే ఏదేని డిఫరెంట్ ప్లేస్‌కు వెళ్తే ఫొటో సెషన్స్ కండక్ట్ చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా మేకప్ అయి ఫొటోలు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరగడం మనం చూడొచ్చు. కోతులు మన వస్తువులును ఎత్తుకెళ్లిన మాదిరిగానే ఓ బర్డ్ ఫోన్‌ను ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.
సదరు వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ఇంట్లో మిద్దె మీద తన మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఫొటోలు దిగుతున్నాడో లేదా మరేం చేస్తున్నాడో తెలియదు. కానీ, కాసేపటికి తన ఫోన్ పిట్టగోడ మీద ఉంచాడు. అంతే.. ఎక్కడో నుంచి వచ్చి ఓ రామచిలుక ఆ ఫోన్‌ను ఫుడ్ ఐటమ్ అనుకుని తన కాళ్ల మధ్యలో పట్టుకొని తుర్రున గాలిలో ఎగిరింది. ఈ క్రమంలోనే అతడికి శబ్దం వినపడగా చూస్తే అప్పటికే ఫోన్ మామయైంది. రామచిలుక ఆ ఫోన్‌ను పట్టుకుని అప్పటికే చాలా దూరం వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలోనే సదరు వ్యక్తి ఫోన్ కోసం పక్షిని వెంబడించాడు. అయితే, ఇదంతా కూడా ఫోన్లో రికార్డు అయింది. స్మార్ట్ ఫోన్ ఆన్‌లోనే ఉండటం వల్ల రికార్డు కాగా, అది సోషల్ మీడియాలో స్పష్టంగా కనబడుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియరాలేదు. ఫ్రెడ్జ్ స్కూల్జ్ అనే యూజర్ ట్విట్టర్ వేదికగా వీడియోను పోస్ట్ చేయగా, అది కాస్తా నెట్టింట వైరలవుతోంది. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘భలే చిలుక... సెల్ఫీదిగేందుకు ఈ పని చేసుంటుందని, ఇది అసలు నిజమైనా వీడియోననేనా, వెయిట్ ఉన్న స్మార్ట్ ఫోన్‌ను బర్డ్ ఎలా క్యారీ చేయగలిగింది’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రామ చిలుక వీడియో నెట్టింట సందడి చేస్తుందనే చెప్పాలి.