వైరల్ వీడియో : అందరూ క్యాబ్ డ్రైవర్ లా ఉండలేరు?

praveen
ఇటీవలే యూపీ రాజధాని లక్నోలో ఓ యువతి ఏకంగా క్యాబ్ డ్రైవర్ ఫై విరుచుకుపడి దాడి చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను కొన్ని రోజులపాటు ఊపేసింది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ ను యువతి అందరి ముందే చెడామడా చెంపదెబ్బలు వాయిస్తూ ఉన్నప్పటికీ..  డ్రైవర్ మాత్రం ఎంతో సహనం గానే ఉన్నాడు.  అందరి ముందు అవమానించేలా మాట్లాడుతూ దారుణంగా కొట్టినప్పటికీ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఒక్కసారి కూడా దురుసుగా ప్రవర్తించ లేదు. అయితే ఆ యువతి కొడుతుంటే చూస్తున్న చుట్టుపక్కల వారికె సహనం నశించింది కానీ ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం ఏకంగా సహనానికి మారుపేరుగా ఉన్నాడు.

 ఇలా ఆ యువతి క్యాబ్ డ్రైవర్ ను దారుణంగా చెంపదెబ్బలు కొట్టిన ఘటన మరవకముందే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒక్కటి వైరల్ గా మారిపోయింది. బట్టల షాపు ముందు ఇద్దరు మహిళలు రెచ్చిపోయారు..  ఏకంగా అక్కడున్న బట్టల షాపు యజమాని పై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఏకంగా చేతిలో ఒక కర్ర కూడా పట్టుకున్నారు.  ఏ మాత్రం భయం లేకుండా ఒక వ్యక్తిపై ఓ యువతి ఏకంగా కర్రతో దాడి చేసింది.  ఈ సమయంలో ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు.  ఏముంది ఇక ఆ బట్టల షాపు యజమాని కూడా ఎంతో ఓపికగా ఆ మహిళ కొడుతున్నప్పటికీ అలాగే నిలబడి ఉండి ఉంటాడు అని అనుకుంటున్నారూ కదా.  అలా అనుకుంటే పొరపాటే బాసు.. ఎందుకంటే అందరూ క్యాబ్ డ్రైవర్ అంత సహనంతో ఉండరూ కదా.

 ఇక్కడ ఏకంగా బట్టల షాపు యజమాని ఇక కర్రతో యువతి అందరి ముందు తనను చితకబాదడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో ఇక ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మీరు ఈ వీడియో చూస్తే ఇద్దరు మహిళలు అక్కడ షాప్ యజమానులతో గొడవ పడుతూ ఉంటారు.  కర్ర తో కొడతా అంటున్న వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వెనక నిలబడ్డ యువతీ ముందుకు వచ్చి కర్రతో అక్కడున్న వ్యక్తిని దారుణంగా కొడుతుంది.  కాసేపటి  వరకు ఓపిక పట్టిన ఆ వ్యక్తి ఇక సహనం నశించి పోయి ఏకంగా ఆ యువతిపై దారుణంగా దాడి చేశాడు. వెంటనే వెనుక ఉన్న మరో వ్యక్తి వచ్చి ఇంకో మహిళపై కూడా దాడి చేశాడు.  కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: