వైరల్ : బాతు పిల్లలను రోడ్డు దాటించేందుకు ఈ వ్యక్తి సాహసం అదుర్స్....!
ఆ వ్యక్తిని నెటిజన్లు అందరు తెగ మెచ్చుకుంటూ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.ఒకసారి వీడియోను పరిశీలిస్తే ఒక బాతు దాని బుజ్జి బుజ్జి బాతులతో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నది.వాహనాలు రద్దీ అధికంగా ఉన్న కారణంతో దఆ తల్లి బాతు, పిల్ల బాతులు రోడ్డుకు ఒక పక్కనే ఉండిపోయాయి.పాపం బాతు పడే కష్టాలను ఒక వ్యక్తి గమనించి ఆ బాతు, బాతు పిల్లలను రోడ్డు దాటించాలని అనుకున్నాడు.రోడ్డు మీద నిలబడి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి మెల్లగా బాతులను రోడ్డు దాటించాడు.
అవి రోడ్డు దాటిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో జరిగిన ఘటనను అక్కడే కారులో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వీడియోతో పాటు 'మానవత్వానికి నిదర్శనం' అని క్యాప్షన్ పెట్టారు.నోరు లేని మూగ జీవాలను రోడ్డు దాటించిన ఆ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ వ్యక్తిని చూసాక మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని అర్ధం అవుతుంది అని మరొకరు కామెంట్ చేసారు.ఇది ఒక అద్భుతమైన వీడియో అని అందరు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో తెగ ప్రచారం అవుతుంది.