బాత్ రూమ్ లో.. సేల్ ఫోన్.. అందరికి కనెక్ట్ అవుతున్న మీమ్?

praveen
మొన్నటి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ అనేది ఒక భాగం మాత్రమే అవసరమైనప్పుడు వినియోగించడం అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పెట్టడం లాంటివి చేసేవారు. ఎవరితో అయినా మాట్లాడాలి అనుకున్నప్పుడు లేదా ఎవరికైనా ఏదైనా సందేశం పంపించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ చేతిలో పట్టుకునేవారు.. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఎంతలా అంటే ఒకప్పుడు మనిషి జీవితంలో ఒక భాగం అయిన మొబైల్ ఇక ఇప్పుడు ఏకంగా మనిషి జీవితాన్ని శాసిస్తుంది. అంతలా ఇప్పుడు రోజులు మారిపోయాయి.



 ఒకప్పుడు కేవలం అవసరం మేరకు మాత్రమే ఉపయోగించి మొబైల్ పక్కన పడేసే వారు. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అరక్షణం పాటు మొబైల్ లేకపోయినా గంటలతరబడి బాధపడిపోతుంటారు నేటి రోజుల్లో జనాలు. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా చేతిలో మొబైల్ మాత్రం ఉండాల్సిందే. చేతిలో మొబైల్ లేదు అంటే పాపం ఏదో కోల్పోయినట్లు.. ఇంకేదో దూరమైనట్లు.. విజయం కోసం పరితపిస్తూ ఉంటే  ఓటమి తలుపు తట్టినట్లు అనిపిస్తోంది నేటి రోజుల్లో మొబైల్ వినియోగదారులకు.


 నేటి రోజుల్లో మొబైల్ వినియోగం ఎంత బాగా పెరిగిపోయింది అనే విషయాన్ని తెలిపే విధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల మీమ్స్ వైరల్ గా మారిపోయాయి. ఇక కొన్ని రకాల చిత్రవిచిత్రమైన మీమ్స్ చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరూ మీమ్ కి బాగా కనెక్ట్ అయి పోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఒక మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  అందరూ పొద్దున్నే లేవగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా వ్యాయామం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఉదయం లేవగానే బాత్రూంలోకి వెళ్లి మొబైల్ పట్టుకొని గంటల తరబడి అక్కడే కూర్చున్నాను అని అర్థం వచ్చేలా ఉంది. ఇక ఈ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నేటిజన్లు అందరికీ తెగ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో యువత ఇలాగే ఉన్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: