చీరలో పల్టీ కొట్టిన మహిళ.. నెట్టింటా వైరల్..

Purushottham Vinay
ఈ రోజుల్లో, భారతదేశంలో మహిళలు చీర కట్టుకుని అసాధారణమైన విన్యాసాలు చేయడం ద్వారా వెలుగులోకి వస్తున్నారు. ఈ మహిళలు విన్యాసాలు చేసేటప్పుడు సాధారణంగా నైట్ డ్రెస్ లు వేసుకుంటారు. కాని చీరలు మాత్రం అస్సలు వేసుకోరు. ఇప్పుడు ఒక మహిళ అయితే చీరలో బ్యాక్‌ఫ్లిప్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక బాగా వైరల్‌గా మారిన ఆ వీడియోలో, జుట్టు విరబోసుకున్న ఆ యువతి మెట్లపై బ్యాక్‌ఫ్లిప్ చేయడం కనిపిస్తుంది. ఎరుపు రంగు చీరలో ఉన్న మహిళ, విన్యాసం చేస్తున్న ఈ వీడియో అందరిని తెగ ఆశ్చర్యపరుస్తుంది. ఇక అక్కడే పక్కన నిలబడి ఉన్న జనాలు కూడా చీరలో బ్యాక్ ఫ్లిప్ చేస్తున్న మహిళను చూసి ఆశ్చర్యపోయారు. ప్రఖ్యాత పాట ‘రంగిలో మహ్రో దోల్నా’ పాట బ్యాక్ గ్రౌండ్ పాటగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియోలో ఉన్న అమ్మాయి బాగా శిక్షణ పొందిన ఓ ప్రొఫెషనల్ జిమ్నాస్ట్. ఆమె పేరు మిషా శర్మ.


ఈ క్లిప్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోని చూసి నెటిజనులు తెగ ఇష్టపడుతున్నారు. నిజానికి అందరూ కూడా ఈమెని బాగా మెచ్చుకుంటూ ఆమె ఖచ్చితంగా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కొందరు కోరుకుంటారు. నెటిజన్లు అందరూ కూడా ఆమెను కామెంట్ బాక్స్‌లో తెగ ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఇలా కామెంట్ చేశాడు.“ప్రభుత్వం ఆమెను ఒలింపిక్ పోటీలకి జిమ్నాస్టిక్స్ ప్లేయర్‌గా ఎందుకు పంపదు?. " అని కామెంట్ చేయగా మరొకరు మాత్రం “ఆమె శిక్షణ పొందితే ఒలింపిక్స్‌లో బంగారు పతకం తీసుకురాగలదు." అని కామెంట్ చేశారు.కాని సరైన శిక్షణ లేక మార్గదర్శకత్వం అనేది లేకుండా ఇలా ప్రదర్శిస్తే ఈ విన్యాసాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల, మీరు ఎలాంటి శిక్షణ లేకుండా అలాంటి ఫ్లిప్స్ చేయవద్దని సూచించారు. మిషా శర్మ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్, అలాంటి పరిపూర్ణతను చేరుకోవడానికి చాలా చాలా హార్డ్ వర్క్ అనేది చెయ్యాలి.ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని ఈ కింద లింక్ ఓపెన్ చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.https://www.instagram.com/reel/CSOciy-KjpU/?utm_medium=copy_link

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: