వైరల్ : ప్రపంచంలోనే అతిపెద్ద నోరు.. మహిళ గిన్నీస్ రికార్డ్?
ఏమి చేయకుండా గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం ఏంటి బాసూ జోక్ చేస్తున్నారా అని అంటారు ఈ మాట చెబితే ఎవరైనా.. జోక్ కాదు ఇప్పటి వరకు ఎంతో మంది ఇలా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వారు కూడా ఉన్నారు ఎలాగా అని అంటారా కొంతమంది ప్రపంచంలోకెల్లా ఎక్కువ పొడవు పెరగడం లాంటివి చేస్తూ ఉంటారు. అది వారు కావాలని చేసింది కాదు కానీ ఇక ఇలా ఎక్కువగా పొడవు ఉండటం కారణంగా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టిస్తూ ఉంటారు. ఇటీవలే ఒక భారతీయుడు అతిపెద్ద నాలుక ఉంది అని గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు మరో మహిళ కూడా ఇలాంటి రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ మహిళ స్పెషాలిటీ ఏంటి అని అంటారా.
ఆ మహిళకు ఈ ప్రపంచంలోనే పెద్ద నోరు ఉంది. ఏంటి అవాక్కయ్యారు కదా. కింద ఉన్న వీడియో చూస్తే మరింత అవాక్కవుతారు ఆ మహిళ ప్రపంచంలోనే అతి పెద్ద నోరు కలిగిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది ఇటీవలే ఆ మహిళకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఆ మహిళ ఏకంగా సాధారణ మనుషులు చేయలేని పనిని చేసి చూపిస్తోంది ఏకంగా 2 బర్గర్లని ఒకేసారి అమాంతంగా నోట్లో పెట్టుకోవడం. అంతేకాదు ఏకంగా ఒక చిప్స్ ప్యాకెట్ లోని చిప్స్ అన్నిటిని కూడా ఒకేసారి నోట్లో పెట్టుకోవడం లాంటివి చేసి ఆశ్చర్యపరుస్తోంది ఇంకెందుకు ఆలస్యం అతి పెద్ద నోరుతో గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్న మహిళా విన్యాసాలను ఒకసారి ఈ వీడియోలో చూసేయండి.