6వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ యువతులు.. వీడియో వైరల్!

frame 6వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ యువతులు.. వీడియో వైరల్!

Suma Kallamadi
సరదాగా చేసే విన్యాసాలే ప్రాణాలు పోయే పరిస్థితులకు దారితీస్తాయి. ఇప్పటికే చాలా మంది సరదాగా విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే తాజాగా ఇద్దరు యువతులు ఒక ఉయ్యాల ఊగి తమ సరదా తీర్చుకుందామని భావించారు. కానీ ఊయల ఊగటమంటే.. ఏ చెట్టుకో లేదా ఇంట్లోనో కాదు. 6 వేల 300 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ అంచున ఉయ్యాల ఊగటం. పొరపాటున ఉయ్యాల లో నుంచి కింద పడితే గాల్లోనే ప్రాణాలు పోతాయి. కానీ ఇదేమి ఆలోచించకుండా ఈ ఇద్దరు యువతులు ఉయ్యాల ఎక్కి ఊగటం ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ ఆ ఉయ్యాలకు ఒకవైపు ఉన్న గొలుసు ఒక్కసారిగా తెగిపడింది. దీంతో వారు కూర్చున్న ఊయల ఒక్కసారిగా ఒరిగింది. దీంతో వారిద్దరూ కొండ అంచు నుంచి కింద పడ్డారు. అయితే ఇదంతా చూస్తున్న అక్కడి పర్యాటకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ ఇద్దరి యువతులకు ఏమైందో ఏమో అని భయం ఆందోళనలు వ్యక్తం చేశారు.






ఈ ఘటన రష్యాలోని డగేస్టన్ లోని కాస్పియన్‌ సముద్రం సమీపంలోని కాన్యాన్ పర్యాటక ప్రాంతంలో ఒక కొండ అంచున జరిగింది. ఊయల గొలుసు తెగిపోవడం.. పట్టు తప్పడం.. ఇద్దరూ కూడా లోయలోకి జారి పడిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ కొండ అంచున డెక్కింగ్ ప్లాట్ ఫాం ఉండటంతో దానిపై పడిపోయారు. ఒకవేళ టూరిజం అధికారులు డెక్కింగ్ ఏర్పాటు చేయకపోతే ఈపాటికి ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయే వారు. అయితే చివరికి వీరిద్దరూ చిన్నపాటి గాయాలతో ఈ భయంకరమైన ఘటన నుంచి తప్పించుకోగలిగారు.




ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసారు. అనంతరం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించి ఊయలను అక్కడ నుంచి తొలగించాలని ఆదేశించారు. ఏది ఏమైనా చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోయే విధంగా ఏర్పాటు చేసిన ఇలాంటి ఊయలను తొలగించడమే అందరికీ శ్రేయస్కరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: