వీడియో: ఏనుగు కంటే పెద్దగా ఉన్న పిల్లి.. షాక్ అవుతున్న ప్రజలు..?
అదే సమయంలో ఆ పిల్లి మధ్యలో జపాన్ భాషలో అడ్వర్టైజ్ మెంట్స్ దర్శనమిచ్చాయి. ఐతే పిల్లి మాత్రం మియావ్ అని అంటూ విభ్రాంతి ని కలగజేసింది. ఈ పెద్ద పిల్లి పై టైమ్ కూడా డిస్ ప్లే అవడంతో ప్రజలకు తాము చూస్తున్నది ఒక 3D ఎల్ఈడీ పిల్లి అని అర్థం అయ్యింది. దీంతో వారంతా వావ్.. ఈ పిల్లి ఏంటి చూడటానికి అచ్చం నిజమైన పిల్లిలాగానే ఉంది అంటూ అవాక్కయ్యారు. మరికొందరు ఈ ఎల్ఈడి 3D క్యాట్ ను తమ ఫోన్ల కెమెరాలో బంధించారు. అనంతరం టోక్యో నగరవాసులు తీసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ వీడియోలు క్షణాల్లోనే లక్షల మంది నెటిజనులకు చేరువయ్యాయి. టోక్యో నగరవాసులు లాగానే నెటిజన్లు కూడా.. "చూసేందుకు ఇది అచ్చం వాస్తవమైన పిల్లి లాగానే ఉంది" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన 17 సెకండ్లు నిడివిగల పిల్లి వీడియోకి 45 లక్షలకు పైగా వచ్చాయి.
ఇకపోతే ఈ పెద్ద పిల్లి 1,664 చదరుపు అడుగుల పరిమాణంలో ఉంటుందని తెలుస్తోంది. కర్వడ్ LED స్క్రీన్ పై 4K రెజల్యూషన్ డిస్ ప్లేలో ఈ పిల్లిని ప్రదర్శించారు. ఐతే టోక్యోలోని షింజుకు జిల్లాలో ఉండే బిల్ బోర్డు అత్యంత రద్దీగా ఉంటుంది.