వైరల్ వీడియో : పేరెంట్స్ ప్రాణాలు కాపాడిన నాలుగేళ్ల చిన్నారి?

praveen
సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఎన్నో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని కొన్ని సార్లు అలాంటి ఘటనలు జీవితంలో విషాదం నింపుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. కానీ త్రుటిలో ప్రమాదం తప్పింది   అయితే సాధారణంగా చిన్న పిల్లలు ఏం చేస్తారు.. ఎప్పుడూ చిలిపి పనులు చేస్తూ తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు.. కొన్ని కొన్ని సార్లు చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని ప్రమాదాలకు కూడా కారణమవుతుంటాయి. అలాంటి సమయంలో ఇక తల్లిదండ్రుల అప్రమత్తంగా ఉండి ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. సాధారణంగా చిన్న పిల్లలు ఎక్కడైనా ఇలాగే చిలిపి పనులు చేస్తూ ఉండటం కామన్. కానీ ఇక్కడ ఒక చిన్నారి మాత్రం.. నాలుగేళ్ల వయసులోనే ఏకంగా తన కుటుంబాన్ని ప్రమాదం నుంచి రక్షించింది.

 ఊరుకోండి బాసు... నాలుగేళ్ల చిన్నారి మొత్తం కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలుగుతుంది.. అని అంటారు ఈ విషయం తెలిస్తే ఎవరైనా. కానీ ఇక్కడ జరిగిన ఘటన తెలిస్తే మాత్రం ఆ చిన్నారి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. సాధారణంగా అయితే నాలుగేళ్ల వయసు వచ్చిన వాళ్ళు బయట స్నేహితులతో ఆడుకుంటూ సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్నారి కూడా అలాగే స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో వంటింట్లో ఏదో జరుగుతుంది అని గమనించింది. దీంతో ఆ చిన్నారి పరుగున వెళ్ళి చూసే సరికి మంటలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక తండ్రిని లేపి అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

 ఇలా ఓ నాలుగేళ్ల చిన్నారి అప్రమత్తతో కుటుంబాన్ని ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా లో వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని ఏమిలియా అనే నాలుగేళ్ల చిన్నారి తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న  సమయంలో కిచెన్ లో మంటలు రావడం గుర్తించింది.  వెంటనే చూసి గదిలో ఉన్న తండ్రిని  అప్రమత్తం చేసింది. ఇక గది నుంచి బయటకు వచ్చిన తండ్రి హుటాహుటిన కిచన్ వైపు వెళ్ళాడు. ఎయిర్ ప్రయర్ లీకై మంటలు చెలరేగాయి  అని గుర్తించాడు.  వెంటనే దాన్ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడేశాడు. ఇదంతా ఇంట్లో ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయింది.  దీనికి దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో ఇక ఆ చిన్నారి సాహసానికి తెలివికి అందరూ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: