ఈ పాముని చూస్తే షాక్ అవ్వాల్సిందే....

Purushottham Vinay
ఈ లోకంలో పాములు ఎంత భయంకరమైన ప్రాణులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పాములు చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని పాములు విషపూరితమైనవి ఉంటాయి. మరికొన్ని పాములు విషం లేని పాములు కూడా ఉంటాయి. ఇక అంతేగాక.. పాము రంగు, రూపంలో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఇక ముఖ్యంగా పాము శరీరంపై ఉండే చారలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఇంకా పాము ఏ రకానికి చెందిన పామునో తెలియజేస్తాయి. కొన్ని పాములకు అయితే వాటి శరీరంపై ఉండే రంగులు భలే ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు రంగు నుంచి పసుపు రంగు వరకు ఎన్నో రంగుల పాములు ఈ భూమిపైన జీవిస్తున్నాయి.ఇక అలాంటి పాముల్లో ఎంతో అరుదైన పాము. ‘రెయిన్ బో’ స్నేక్.ఇంద్రధనస్సులోని రంగులతో ఎంతగానో మురిపిస్తున్న ఆ పాము ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయంగా మారి వైరల్ అవుతుంది. ఇక కాలిఫోర్నియాలో పాముల కోసం ప్రత్యేకంగా సరీసృపాల జూ తయారు చేసిన చేసిన జయ్ బ్రెవర్ అనే వ్యక్తి మరోసారి ఓ అరుదైన పాముతో ఆకట్టుకున్నాడు.

ఈ సారి అతడు ఒళ్లంతో రెయిన్ బో రంగులతో మెరిసిపోతున్న ‘రెయిన్ బో’ స్నేక్‌ను సేకరించాడు.ఇక ఈ పాము సూర్యరశ్మిలోకి రాగానే.. దాని శరీరం అంతా కూడా వివిధ రంగులతో తళ తళ మెరిసిపోతోంది. ఇక ఎవరైనా ఈ పాముని చూస్తే.. ఖచ్చితంగా అది ప్లాస్టిక్ పామని భావించే అవకాశం ఉంది. ఇక ఈ వీడియోలో జయ్ రెయిన్‌బో స్నేకును బాక్సులో పెట్టడాన్ని మీరు గమనించవచ్చు. ఇది కొండ చిలువల జాతిలో ఒక రకమైన పామని జయ్ ఈ సందర్భంగా తెలిపాడం జరిగింది.ఇక ఇది అరుదుగా కనిపించే ఈ జాతి పాములుని ఇవి విషపూరితం కాదని, పెద్దగా హాని కూడా తలపెట్టవని పేర్కొన్నాడు. ఇవి ఆగ్నేయ అమెరికాలోని ఎక్కువగా కనిపించే ఈ రెయిన్ బో స్నేక్‌‌ శాస్త్రీయ నామం ఫరాన్సియా ఎరిత్రోగామ (Farancia Erytrogramma) అని తెలిపాడు. మరి ఈ రెయిన్ బో రంగుల కొండ చిలువను మీకూ చూడాలని ఉందా? అయితే, ఈ కింది  ఫోటో చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: