జొమాటో బాయ్ కి బైక్ గిఫ్ట్ ఇచ్చిన కస్టమర్.. ఎక్కడంటే ?

Satvika
మనిషి అన్నాక కాస్త దయా, జాలి తో పాటుగా మానవత్వం కూడా ఉండాలి. అది మనిషి కనీస ధర్మం.. ఈ మధ్య రోజుల్లో ఆ పదానికి చాలా మందికి అర్థం కూడా తెలియదు.. కానీ ఓ వ్యక్తి పేదరికంలో ఉన్న జొమాటో బాయ్ పై మానవత్వం చాటుకున్నాడు. అతని కష్టాన్ని చూసి చలించిపోయాడు. కుటుంబ పోషణ కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి అతనికి ఆసరాగా నిలబడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

విషయానికొస్తే.. హైదరాబాద్ లో జొమాటో కు మంచి డిమాండ్ ఉంది. ఎప్పుడైనా, ఎక్కడికైనా కూడా డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీ చేస్తారు. కాగా, ఓ డెలివరీ బాయ్ మాత్రం అందరి మనసును కరిగించాడు. అతికష్టమ్మీద సైకిల్‌ పై ఫుడ్ డెలివరీ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాంటి వ్యక్తి కి కొందరు యువకులు అండగా నిలిచారు. జొమోటో బాయ్‌కి కస్టమర్‌ రూపం లో ఆపన్నహస్తం అందింది. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి జొమాటో ఫుడ్ ఆర్డర్ చేసాడు.

ఆర్డర్ తీసుకున్న డెలివరీ బాయ్ తొమ్మిది కిలో మీటర్లు సైకిల్ మీద తొక్కుకుంటూ వచ్చి డెలివరీ చేసాడు. అది చూసిన కస్టమర్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్నీ  వెంటనే ‘ది గ్రేట్‌ హైదరాబాద్‌ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌’ ఫేస్‌బుక్‌ పేజీ లో పోస్ట్ చేసాడు. అందులో ఉన్న వాళ్లంతా కూడా తమకు తోచిన సాయాన్ని అందించారు. దీంతో 64 వేల తో అతని టీవీఎస్ ను కొనిచ్చారు.  మిగిలిన డబ్బులను అతనికి అందించారు. అందరి లాగా మనకెందుకు అని కాకుండా ముందు కొచ్చి అతనికి సాయం అందించిన అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ  ట్రెండ్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: