కోవిషీల్డ్ వధువుకు వరుడు కావలెను.. షరతులు వర్తిస్తాయ్!
ఈ క్లిప్ జూన్ 4, 2021 న ఒక వార్తాపత్రిక యొక్క మ్యాట్రిమోనియల్ కాలమ్‌లో కనిపించింది, ఇందులో స్వయం ఉపాధి పొందిన రోమన్ కాథలిక్ మహిళ తన సొంత మతానికి చెందిన వ్యక్తితో వివాహం కోరింది, కాని అదనపు షరతు పెట్టింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదులను తాను ఇప్పటికే తీసుకున్నానని అందుకే సేమ్ నాలాగే కోవిషీల్డ్ టీకా తీసుకున్న వ్యక్తి నాకు వరుడిగా కావాలని ఆ మహిళ షరతు పెట్టింది. ఇక ఈ ప్రకటన నెటిజనులు పడి పడి నవ్వుకుంటున్నారు. కొంతమంది అయితే నిజంగా ఈమె చాలా బాధ్యతగా ఆలోచించిందని కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది ఏ వాక్సిన్ తీసుకోకపోతే పెళ్లి చేసుకోవా.. జీవితాంతం అలానే వుంటావా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైన ఈ ఫన్నీ ప్రకటన నెట్టింట నవ్వులు పూయిస్తూ తెగ వైరల్ అవుతుంది.