వైరల్ :మే 26న రాబోయే చంద్ర గ్రహణం మన భారతదేశంలో ఎక్కడ చూడాలో తెలుసా ?

Divya

పౌర్ణమి రోజున భూమి సూర్యుడు, చంద్రుడు ల  మధ్య వచ్చినప్పుడు అంటే ఈ మూడు గ్రహాలు సమలేఖనం అయినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుందని మనం చిన్నప్పుడు చదువుకున్న సోషల్ పాఠ్యపుస్తకాలలో దీనిని తెలుసుకునే ఉంటాము. అయితే మొత్తం చంద్రుడు భూమి కిందకు వచ్చినప్పుడు మొత్తం చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే రేపు అనగా మే 26 న  ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా ,అంటార్కిటికా ,పసిఫిక్ మహాసముద్రం తోపాటు హిందూ మహాసముద్రం ఉన్న ప్రాంతాలలో కూడా చంద్రగ్రహణం కనిపిస్తుంది అని భారత వాతావరణ శాఖ( ఐఎండి )తెలిపింది.


ఇక భారత దేశంలో ఈశాన్య ప్రాంతాలు అయిన పశ్చిమబెంగాల్ ,ఒడిస్సా తో పాటు అండమాన్, నికోబార్ దీవుల నుండి బుధవారం ఒక చంద్రగ్రహణం కొద్దిసేపు కనిపిస్తుంది అని భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.


అయితే మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణాన్ని ఏ సమయంలో, ఎక్కడ చూడవచ్చో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గ్రహణం యొక్క పాక్షిక దశ భారతదేశంలో మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:23 గంటలకు ముగుస్తుంది. మొత్తం దశ సాయంత్రం 4:39 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:58 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. ఇంకా ఐఎండీ తెలిపిన ప్రకారం పోర్ట్ బ్లెయిర్ నుండి గ్రహణం సాయంత్రం 5:38 గంటల నుండి చూడవచ్చు .అలాగే 45 నిమిషాల పాటు చూసే అవకాశం ఉంటుంది. బెంగాల్లో పూరి అలాగే మల్డా లో సాయంత్రం  6:21 గంటలకు చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు కానీ రెండు నిమిషాలు మాత్రమే కుదురుతుంది.


ఇక భారతదేశంలో చంద్రోదయం తర్వాత గ్రహణం యొక్క పాక్షిక దశ భారతదేశంలోని ఈశాన్య భాగాలైన పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో కొన్ని ప్రాంతాలలో చంద్రగ్రహణం ముగుస్తుందని ఐఎండీ తెలిపింది. ఇక చంద్రగ్రహణం నుండి చంద్రుడు తూర్పు హోరిజోన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు భారతదేశం నుండి ఈ గ్రహం యొక్క ప్రారంభాన్ని చూడలేరు. అయితే తూర్పు భారతదేశంలో నివసించే ప్రజలు పాక్షిక దశ చంద్రగ్రహణం మాత్రమే చూడగలుగుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: