నగ్నంగా బిడ్డకి పాలిచ్చిన మహిళ..
అయితే, ఆమె మామూలు మహిళ కాదు.. ఆస్ట్రేలియా ఒలింపిక్ స్నో బోర్డ్ ఛాంపియన్ టోరా బ్రైట్. 34 ఏళ్ల టోరా ఇటీవల ఆమె ‘మదర్స్ డే’ పురస్కరించుకుని తన పది నెలల కొడుకుతో ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె దుస్తులు విప్పేసి, కేవలం అండర్‌వేర్‌తో తలకిందులగా శీర్షాసనం వేసి తన బిడ్డకు పాలివ్వడం జరిగింది. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోని టోరా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది అప్పట్నుంచి తెగ వైరల్ అవుతుంది.
అయితే, ఆమె ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ చేసిన కొందరు నెటిజనులు మాత్రం దీన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోయారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆమె చేసిన పని అమ్మతనానికే అవమానకరమంటూ అంతా మండిపడ్డారు. బిడ్డకు బహిరంగ ప్రాంతాల్లో ఆకలి తీర్చి ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. కానీ, ఇలా నగ్నంగా.. బట్టలు విప్పేసి.. అన్నీ పదర్శించడమే తప్పు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆమె చేసిన పనిలో తప్పేంటని ఆమె ఫ్యాన్స్ టోరాకు మద్దతు తెలిపారు. తల్లి ప్రేమను ఆమె భిన్నంగా తెలియజేయడానికి ప్రయత్నించిందని టోరాకు సపోర్ట్ చేస్తున్నారు. మనం చూసే చూపుల్లో తప్పు వుండకూడదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నైట్టింట హల్ చల్ చేస్తుంది.