భార్యను కాపాడుకోడానికి.. 75 ఏళ్ల వయస్సులో వయొలిన్ పట్టిన భర్త...

Purushottham Vinay
పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వపన్ శేట్ అనే 77 ఏళ్ల వ్యక్తి 2002 నుంచి గర్భాశయ క్యాన్సర్ తో బాధ పడుతున్న తన భార్యను కాపాడుకొనేందుకు ‘వయోలిన్’నే నమ్ముకున్నారు. ఈ వయస్సులోనూ నిర్విరామంగా వయోలిన్ వాయిస్తూ విరాళాలు సేకరిస్తున్నారు. అయితే, ఆమె వైద్యానికి అవసరమైన ఖర్చులు భరించేంత ఆర్థిక బలం లేకపోవడంతో వయోలిన్ వాయిస్తూ విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు. అలా సేకరించిన నగదుతో ఎట్టకేలకు ఆయన తన భార్యను కాపాడుకోగలిగారు. 2019లో ఆమె క్యాన్సర్ అదుపులోకి వచ్చింది.. 17 ఏళ్లు ఆయన పడిన కష్టానికి.. ఆమె ఎట్టకేలకు కోలుకున్నారని పేర్కొన్నారు.


ఎవరైనా తన ప్రదర్శన తిలకిస్తే.. స్వపన్ వారికి ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తారట. ఏది ఏమైనా.. ఓ భర్తగా తన భార్యను కాపాడుకోడానికి ఆయన పడిన శ్రమ నిజంగా ప్రశంసనీయంగా చెప్పుకోవాలి.అలా మొదలైన ఆయన వయోలిన్ ప్రదర్శన.. ఇప్పుడు కుటుంబాన్ని పోషించేందుకు ఉపయోగపడుతోంది. భార్య ప్రాణాలు కాపాడిన ఆ సంగీతాన్ని బతికించాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పటికీ ప్రజలు తిరిగే షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లోకి వెళ్లి వయోలిన్ వాయిస్తున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ వద్ద ఆయన వయోలిన్ వాయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్లని కుర్తా, దోతి ధరించిన స్వపన్.. ఎస్కలేటర్ సమీపంలో కూర్చొని వయొలిన్ వాయిస్తుంటే.. జనాలు మైమరచిపోయి ఆస్వాదిస్తున్నారు.ఆయనకు విరాళాలు ఇచ్చారు.నిజంగా ఈయన చేసిన ఈ పని భావి తరాలకి ఆదర్శంగా మారింది. చాలా మంది ఈయన చేసిన పనికి శభాష్ తాత అంటూ అభినందిస్తున్నారు. ఒక నిజమైన భర్తకు వుండాల్సిన బాధ్యత ఈయనకు ఉందని మెచ్చుకుంటున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది...ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ వార్తల గురించి తెలుసుకోండి ...


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: