వైరల్ : సోషల్ మీడియాలో తెగ తెగ ట్రోల్ అవుతున్న మిఠాయి కొట్టు చిట్టెమ్మ సీరియల్......

Purushottham Vinay
సీరియల్స్ మాములుగా ఉంటేనే ట్రోల్ల్స్ తప్పవు. అలాంటిది ఇంకా ఓవర్ గా ఉంటే ఇంకా ఏ రేంజిలో ట్రోల్ చేస్తారో ఊహించుకోండి. తాజాగా ఒక సీరియల్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది.ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రారంభమైన ‘మిఠాయి కొట్టు చిట్టెమ్మ’ అనే సీరియల్‌లోని ఈ ‘భారీ’ సీన్ చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.ఇంకా నవ్వు కూడా ఆపుకోలేరు.ఎందుకంటే.. ఇందులో ఏకంగా విమానంలోనే నిశ్చితార్థం చేసేస్తారు. విమానంలోని సీట్లు పీకేసి మరీ మన సాంప్రదాయ పద్ధతిలో పైలట్‌కు ఎంగేజ్మెంట్ చేస్తారు. ఈ సీన్ చూస్తే.. ఖచ్చితంగా మరి ఇంత ఘోరమా అనుకుంటారు.ఇక కథ విషయానికి వస్తే.... ఆత్రేయపురం గ్రామంలో స్వీట్ షాప్ నడిపే ఒక మధ్యతరగతి కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ స్వీట్ షాప్ నడుపుతున్న చిట్టెమ్మను.. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న రాజకీయవేత్త కాంతమ్మ కొడుకు ప్రేమిస్తాడు. అక్కడ నుంచి కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సందర్భంగా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను చిట్టెమ్మ ఎలా ఎదుర్కొంటుందనేది బుల్లితెరపైనే చూడాలి.


ఈ సీరియల్‌లో హీరో పైలట్. అతడికి తెలియకుండా నిశ్చితార్థం జరిపేందుకు ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా అతడు నడుపుతున్న విమానమే ఎక్కుతారు. పైలట్‌(హీరో)ను ప్యాసింజర్ క్యాబిన్‌లోకి పిలిపించుకుని మరీ సర్‌ప్రైజ్ చేస్తారు. ఇంట్లో నేల మీద కూర్చున్నట్లే ఆ విమానంలో పూజారితో సహా అతడి కుటుంబ సభ్యులు కింద కూర్చొని నిశ్చితార్థం జరిపిస్తారు. విమానంలో కూర్చీలు ఏమయ్యాయని ప్రశ్నించవద్దు. ఎందుకంటే.. ఇది డైలీ సిరియల్.. ఇందులో లాజిక్కులు వెతికితే బుర్ర పాడవ్వడం ఖాయం. ప్రస్తుతం ఈ సీరియల్ మీమర్స్ కి స్టఫ్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ సీరియల్ మీద మీమ్స్ క్రియేట్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్..ఇక చాలా వైరల్ కూడా అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: