దేవుడా.. ఓ మంచి దేవుడా..ఈ బుడ్డోడు చేసిన ప్రార్థన వింటే నవ్వాపుకోలేరు..!
స్కూల్లో ప్రార్థన జరుగుతుంటే అందరి విద్యార్థుల మాదిరిగానే కళ్ళు మూసుకుని... దేవుడా మాకు ఇంత శక్తినివ్వు అని దేవుడిని ప్రార్థిస్తూ మరోవైపు లాలీపాప్ నోట్లో పెట్టుకుని ప్రార్ధన మధ్యలో చప్పరిస్తూ ఆ రుచిని ఆస్వాదిస్తూన్నాడు. కళ్ళు మూసుకొని మరి దేవుడికి సిన్సియర్ గా ప్రార్థన చేస్తూ లాలీపాప్ తినడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ బుడ్డోడు చేసిన ఈ చిలిపి ప్రార్థనకు సంబంధించిన వీడియోను ఛత్తీస్‌గఢ్‌లోని కబిర్ధామ్ జిల్లా కలెక్టర్ అవనీష్ శరణ్ ఈ బుడ్డోడి వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ బుడ్డోడి ప్రార్థన వీడియో చూసిన ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు."ఈ కుర్రాడి రూటే సపరేటు...ఈ వీడియో చూసిన ఎవరైనా తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ బుడ్డోడు చేసిన అమాయకత్వపు ప్రార్థన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతోమందికి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. అదేవిధంగా ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరెందుకాలస్యం ఈ వీడియో మీరు కూడా చూసి మీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.