ఒకప్పుడు డ్యాన్స్ అనే కాళ్ళు చేతులు ఆడిస్తూ ముఖకదలికలు మారుస్తూ ఆకట్టుకోవడం. కానీ మెల్లి మెల్లిగా డ్యాన్స్ లో రకాలు వచ్చాయి..రకాల తో పాటు డ్యాన్స్ లో అడ్వెంచర్ లు కూడా భాగమైపోయాయి . దాంతో వస్తువుల ను ఉపయోగించి స్టేజ్ పై స్టెప్పులు వేయడం...కత్తులతో విన్యాసాలు చేయడం కూడా డ్యాన్స్ లో ఒక భాగమైపోయింది. ఈ నేపథ్యంలోనే స్నేక్ డ్యాన్స్ అంటూ కూడా ఒకటి వచ్చింది. డ్యాన్స్ ను మనదగ్గర ఎవరూ చేయరు గాని విదేశాల్లో మాత్రం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తారు. దాంతో అందరూ చేసేది చేస్తే కిక్కేముంది... ఏదైనా చేస్తే కిక్కుండాలి అనుకున్నాడో ఏమో మన ఏపీ కుర్రాడు కూడా స్నేక్ డ్యాన్స్ కు రెడీ అయ్యాడు. అంతే కాకుండా అనకొండనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు . ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో చోటు చేసుకుంది. లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్న కారు మంచి గంగచాలం అనే వ్యక్తి ఇంట్లో 11 అడుగుల అనకొండ ను చూసి స్థానికులు షాక్ అయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గంగా చలం ఇంటికి చేరుకుని గంగాచలం ను విచారించడంతో పెరుమలికి చెందిన అతని మిత్రుడు భగవాన్ ఆ పామును తీసుకువచ్చడాని చెప్పాడు. 8నెలల వయస్సు ఉన్న ఆపాము తో స్నేక్ డాన్స్ చేయడానికి భగవాన్ తీసుకువచ్చడాని చెప్పడు. ఇక ఆ కొండ చిలువను పోలీసులు స్వాధీనం చేసుకునే సమయంలో అది బాత్రూం లో నక్కింది. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు ఆ పామును స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా నిందితులపై వన్యప్రాణి సరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసారు. దాంతో పాముతో స్నేక్ డ్యాన్స్ ఏమో గాని జైలుకు వెళ్లి చిప్ప కూడు తినే పరిస్థితి వచ్చింది .
మరింత సమాచారం తెలుసుకోండి: