వైరల్ : మూగ జంతువని కనికరం లేకుండా ఏనుగుని చెట్టుకి కట్టేసి కొట్టిన దుర్మార్గులు....!!!!

Purushottham Vinay

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి.రోజు రోజుకి మూగ జీవాలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.అయితే కొన్ని జంతువులు తమ ఆత్మ రక్షణకు మనుషులపై దాడి చేస్తుంటే వాటి బారినుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలో అతిగా వాటిపై దాడి చెయ్యటం వలన అవి మృతి చెందడం జరుగుతోంది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ఏనుగుపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే ఎవరికైనా సరే అయ్యో పాపం అని అనిపించక మానదు. రీజువెనేషన్ క్యాంపులోని ఓ ఏనుగును చెట్టుకు కట్టేసి ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. కర్రలతో ఇష్టమొచ్చినట్లు చితక బాదారు. ఈ దృశ్యాన్ని ఆ శిబిరానికి దగ్గరలో ఉన్న స్థానికులు తమ మొబైల్ ఫోన్లతో వీడియో రికార్డు చేశారు.



ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...తమిళనాడు రాష్ట్రంలో పుదుచ్చేరిలలోని పలు మఠాల నుంచి కొన్ని ఏనుగులను ఈ రీజువెనేషన్ క్యాంప్‌కు తరలించడం జరిగింది. ఈ క్యాంపు కోయంబత్తూరు జిల్లాలోని తేకంపట్టిలో ఉంది. ఇక్కడే ఏనుగులను దాదాపు రెండు నెలల పాటు ఉంచుతారు. ఈ క్రమంలోనే ఆ మూగ జీవిపై ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం కనికరం లేకుండా కర్రలతో చితకబాదారు. పాపం ఆ మూగజీవి ఘీంకారాలు పెట్టిందే తప్ప తాను అనుభవిస్తున్న బాధను మాత్రం చెప్పలేకపోయింది.అంతలా హింసించారు ఆ దుర్మార్గులు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పలువురు జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మూగజీవాలపై మనిషి దాడి చేయడం ఎప్పుడు మానేస్తాడంటూ ప్రశ్నించారు. ఇక వీడియో వైరల్ అవడంతో ఆ గజరాజును చితకబాదిన ఇద్దరు వ్యక్తులు వినీల్ కుమార్, శివప్రసాద్‌లను అటవీశాఖ అధికారులు అరెస్టు చేయడం జరిగింది... ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి....



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: