అలాంటి వ్యాధితో బాధపడుతున్న సింగర్ సునీత..!
సింగర్ సునీత మాట్లాడుతూ తాను గత కొన్నేళ్లుగా "క్రాన్స్" అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేసింది. ఇది తన జీవితంలో జరిగిన కొన్ని పర్సనల్ సమస్యలు వ్యక్తిగత ఇబ్బందుల వల్లే వచ్చిందని, తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని ఆ బాధ అంతా కూడా తనలో దాచుకోవడం వల్లే ఆటో ఇమ్యూన్ డిసిజ్ వచ్చిందని తెలియజేసింది. ఇప్పటికీ కూడా తాను ఈ వ్యాధితో ఫైట్ చేస్తున్నానని, ఏదైనా ఒత్తిడి పెరిగిన శరీరమంతా కూడా చాలా నొప్పులు వస్తాయంటూ తెలియజేసింది సింగర్ సునీత.
అలాగే ఇండస్ట్రీలో మహిళల పైన జరుగుతున్న వేధింపుల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. సినీ పరిశ్రమలో వేధింపులు జరుగుతాయి అనేది కూడా అక్షరాల నిజమని అయితే అది ఇప్పటికీ గుర్తింపు సంపాదించుకున్న వారి కంటే కొత్తగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల విషయంలోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తాను 18 ఏళ్ల వయసులోనే ఇలాంటి చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నానని తెలియజేసింది.. అలాగే ఇండస్ట్రీలో వచ్చే వారికి ఫైనాన్షియల్ గా, మెంటల్‌గా , ఎమోషనల్ గా ఫిజికల్ గా అన్నిటికీ స్ట్రాంగ్ గా ఉండాలని అప్పుడే వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు అంటూ తెలియజేసింది సునీత.
సింగర్ సునీతకు ఇద్దరు పిల్లలు, 2020లో ఈమె రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకుంది.