భారీ మంచు వర్షంతో కుప్పకూలిపోయిన ఇల్లు....
వర్షాలు, వరదల వల్లే కాదు.. భారీగా మంచు కురిసినా ఇళ్లు కూలిపోతాయి. జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్లో ఇటీవల భారీగా మంచు వర్షం కురిసింది. దీంతో ఇళ్లపై భారీగా మంచు పేరుకుపోయింది.ఆ బరువుకు ఓ ఇల్లు కుప్పకూలింది. స్థానికులు కొందరు ఈ ప్రమాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలాంటి ప్రమాదం ఎన్నడూ చూడలేదని రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు.ఎంతైనా మన కళ్ళముందే ఇల్లు కూలిపోవడం అంటే భయానకమే కదా. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ న్యూస్ ల గురించి తెలుసుకోండి...