వైరల్ : తెప్పపై ఫోటో షూట్....!!! చివరకు ఏమయ్యారో తెలుసా...??

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి. కొంత మందికి ఫోటోలు పిచ్చి ఎక్కువ అందుకే ఫోటో షూట్లు కోసం ఎక్కడైనా ఏమైనా చేస్తారు. ఇక పోతే  ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్స్ కోసం చాలామంది సముద్ర తీరాలు, రిజర్వాయర్లు, కాలువలు, జలపాతాలను ఎంచుకుంటున్నారు. అక్కడ ఫొటోలు బాగానే వస్తాయి. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తేనే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అలాంటి ప్రమాదమే కర్ణాటకలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే....కర్ణాటక లోని  బెంగళూరు‌కు చెందిన శశికళ, చంద్రులకు గత వారం నిశ్చితార్ధం జరిగిందట . ఈ నెల అంటే నవంబరు 22న వారి వివాహం జరుగబోతుంది. ఈ సందర్భంగా ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్‌ చేసుకోవాలని  నిర్ణయించుకున్నారు. తల్కాడ్‌లోని రిసార్ట్‌లో ఫొటోలు తీయించుకోడానికి వెళ్లారు. కావేరీ నదిలోకి వెళ్లేందుకు బోటు కావాలని అడిగారు. అయితే, బోటు కేవలం ఆ రిసార్ట్‌కు వచ్చే అతిథులకు మాత్రమేనని సిబ్బంది తెలిపారు. దీంతో వారు సమీపంలో ఉన్న ఓ తెప్పలో నదిలోకి వెళ్లాలని అనుకున్నారు. ముందుగా చంద్రు తెప్పలోకి ఎక్కాడు. ఆ తర్వాత శశికళ తెప్ప ఎక్కేందుకు ప్రయత్నించింది. హైహీల్స్ ధరించడం వల్ల ఆమె ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పింది. అంతే.. తెప్ప బోల్తాపడి ఇద్దరూ నదిలో పడిపోయారు.

ఇక అక్కడ వున్న ఫొటోగ్రాఫర్ల టీమ్ స్థానిక జాలర్ల సహాయంతో  శశికళ, చంద్రులను  రక్షించేందుకు ప్రయత్నించారు. అనంతరం పోలీసులు గజ ఈతగాళ్లను, అగ్నిమాపక దళాలను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది. వారు తెప్పలోకి ఎక్కే సమయంలో నదీ ప్రవాహం చాలా వేగంగా ఉంది. దీంతో వారు నదిలో పడివెంటనే కొట్టుకుపోయారు. సుమారు 5 గంటల పాటు వారి కోసం గాలించారు .. చివరికి ఇద్దరు చనిపోయి శవాలుగా మారారు. పోలీస్ లు వాళ్ళను పోస్టు మార్టం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు పాపం కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత దారుణం చూడండి.. జీవితంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కలిసి బతకాలనుకోవాలనుకున్న జంట ప్రకృతి వైపరీత్యం వలన కలిసి చనిపోయారు. కాబట్టి ప్రతి సెకను జాగ్రత్తగా ఉండండి. ఏమైనా జరగొచ్చు. ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: