వైరల్ అవుతున్న ఒక బుడ్డోడు, అస్థిపంజరం కథ..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి.. మన చిన్నప్పుడు అన్నం తినకపోతే బూచోడు ఎత్తుకుపోతాడని అమ్మ పిల్లలను భయపెడుతుంది. కానీ, ఈ పిల్లాడు మాత్రం బూచోడు పక్కన ఉంటేనే భోజనం చేస్తాడు. దానితోనే ఆటలు ఆడతాడు.. టైంపాస్ చేస్తాడు. పట్టపగలే హడలెత్తించే అస్థిపంజరంతో దోస్తీ చేస్తున్న ఈ బుడ్డోడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇంతకీ.. అతడికి ఆ అస్థిపంజరంతో బంధం ఎలా ఏర్పడిందో చూసేద్దామా!

అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడి పేరు థియో. అతడు ఎక్కడ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ ఉండాల్సిందే. బెస్ట్ ఫ్రెండ్ అంటే.. మనుషులని మాత్రం అనుకోవద్దు. బెన్నీ.. అంటే అస్థిపంజరం. అయితే, అది నిజమైన అస్థిపంజరం కాదులెండి, బొమ్మ అస్థిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు అలాంటి బొమ్మలను చూస్తే హడలిపోతారు. అయితే బ్రాడీ మాత్రం మనసు పాడేసుకున్నాడు. నిత్యం ఆ బొమ్మతోనే ఉంటాడు. అది క్షణం కనిపించకపోతే.. ఇల్లు తీసి పందిరేస్తాడు.

సెప్టెంబరు 15 నుంచి బెన్నీకి, థియోకి మధ్య స్నేహం మొదలైంది. ఆ రోజు జోరు వాన కురుస్తోంది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. దీంతో థియో తల్లిదండ్రులు ఇంటి బేస్మెంట్లో ఉన్న వస్తువులను పైకి తెచ్చారు. వాటిలో హాలోవీన్ రోజున ఇంటి బయట తగిలించే అస్థిపంజరం బొమ్మ కూడా ఉంది. అప్పటి నుంచి థియో ఆ బొమ్మను వదలడం లేదు. దీనికి తోడు ఇటీవల ఓ కుక్క అస్థిపంజరాన్ని కూడా కొనిపించుకున్నాడు. ఇటీవల షాపింగ్‌కు వెళ్తే.. ఆ బొమ్మ అతడి కంట పడింది. థియో ఇప్పుడు ఆ రెండు అస్థిపంజరాలతోనే ఎక్కువ గడుపుతున్నాడు. కొడుకు వింత టేస్టును తల్లి బ్రాడి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. వాటిని చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. థియో అస్థిపంజరంతో టైంపాస్ చేస్తున్న వీడియోలను ఫొటోలను కింది ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల్లో చూడండి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: