వైరల్ : నిమిషాల్లో ముంచుకొచ్చిన వరద.. కళ్లముందే కొట్టుకెళ్లిన కారు..!?

Chakravarthi Kalyan
ప్రకృతి ప్రకోపిస్తే.. మనిషి ఈ భూమి మీద నిలవలేడు అనేది మరోసారి రుజువు అవుతోంది. మనిషి ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఎన్ని ఆవిష్కరణలు కనిపెడుతున్నా.. ఎంతగా అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా ఇంకా అతని పరిమితులు అతనికి ఉన్నాయి. టెక్నాలజీతో కొత్త కొత్త వస్తువులు కనిపెడుతున్నా ఇంకా అతడు ప్రకృతికి బానిసే.


అనుకోకుండా దూసుకొచ్చే విపత్తులను అడ్డుకోవడం మనిషి వల్ల కావడం లేదు. ముఖ్యంగా వానలు. వరదలు వచ్చినప్పుడు మనిషి అచేతనుడు అవుతున్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో అంత సీన్ పెద్దగా లేదు కానీ.. ఉత్తర భారతంలో ప్రత్యేకించి హిమాలయాల ప్రాంతంలో వరదలు, ఉప్పెనలు అనూహ్యంగా ముంచుకొస్తాయి. అప్పటికప్పుడే విరుచుకుపడతాయి.



అప్పటి వరకూ ఎలాంటి సూచనలు లేకపోయినా నిమిషాల్లో దూసుకొచ్చి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అలాంటిదే.. ఇది ఉత్తర‌ప్రదేశ్‌లోని శహరనపూర్‌లోది. అక్కడ శకాంభరీ దేవి ఆలయం ఉంది. ఆ ప్రాంతంలో ఇది చాలా ఫేమస్.. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే తాజాగా కొందరు కారులో ఈ ఆలయానికి వచ్చారు. అప్పటికే ఒకటి, రెండు రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి.


అయినా ముందుగా అనుకున్న కార్యక్రమం కావడంతో అమ్మవారి దర్శనానికి వచ్చారు. కారు పార్కు చేసి గుళ్లోకి వెళ్లారు. ఇంతలో మరోసారి వర్షం పుంజుకుంది. పై ప్రాంతాల్లోనూ బాగా వర్షం కురవడంతో వరద పెరిగింది. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి గుడి దగ్గర వరద పెరిగింది. చూస్తుండగానే వరద విశ్వరూపం దాల్చింది.. పార్కు చేసిన కారు కొట్టుకుపోవడం ప్రారంభమైంది. అంతా చూస్తుండగానే కారు కొట్టుకుపోయింది. ఆవేశపడి కారు కోసం వెళ్తే ప్రాణాలకే ప్రమాదం అని వారికి అర్థమైపోయింది. అందుకే కళ్ల ముందు కారు కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక నిలబడిపోయారు.  ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: