రిలయన్స్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ చేతికి చైనా "టిక్ టాక్" పగ్గాలు?

VAMSI
"టిక్ టాక్" ఇది చైనా దేశానికి చెందిన "వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్". ఈ యాప్ ను 2012  సంవత్సరంలో ఆవిష్కరించారు. చైనా మార్కెట్లో 2016 న విడుదల చేసారు. తరువాత అది అలా చక్కర్లు కొడుతూ  మనకు ఇండియా లో 2017 సంవత్సరంలో దర్శనమిచ్చింది. ఇంక ఇది మొదలు "టిక్ టాక్" రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎవరు ఖాళీగా ఉన్నా టిక్ టాక్, లవ్ ఫెయిల్యూర్ అయినా టిక్ టాక్, ఫ్రెండ్షిప్ డే అయినా టిక్ టాక్ వీడియోస్. టిక్ టాక్ లో మనకు తెలిసిన ప్రతి టాలెంటును అంటే పాట పాడడం, డాన్స్ వేయడం, జోక్స్ చెప్పడం, నటించడం ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్ ను వీడియో రూపంలో తీసి పోస్ట్ చేయవచ్చు.ఈ వీడియో నిడివి 15 నుండి 20  సెకండ్స్  మాత్రమే. ఈ యాప్ లో పోస్ట్ చేయడానికి ఎంతో మంది యువతీ యువకులు పనులు మానుకుని మరీ పోస్ట్ చేసేవారు. అంతగా ఆ టిక్ టాక్ యాప్ ప్రజాధరణపొందింది.


యువత అయితే ఎంతగా ఈ యాప్ వైపు మొగ్గు చూపారంటే ఎన్నెన్నో వీడియోస్ సృష్టించేలా, తమలోని వైవిధ్యమైన టాలెంట్ తో రకరకాల వీడియోస్, బీభత్సమైన డైలాగ్స్ తో తమ తమ టాలెంటులను ఆ యాప్ లో పోస్ట్ చేసేవారు. మరీ కొందరైతే ఈ యాప్ వలన చనిపోయారనుకోండి. దీనివలన ఎన్నో కుటుంబాలు విడిపోయాయి,ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఒక్కటి గమనించండి ఏదైనా టెక్నాలజీ వచ్చిందంటే దానిని మనము ఏవిధముగా మన జీవితానికి ఉపయోగపడేలాగా చేసుకోగలమో ఆలోచించాలి అదే కార్యాచరణతో ముందుకెళ్లాలి. ఇలా టిక్ టాక్ తో చాలా సరదాగా, సాఫీగా సాగుతున్న సమయంలో మానవజాతిని కబళించడానికి "కరోనా వైరస్" అనే మహమ్మారి చైనా నుండి వచ్చింది.


ఇక అప్పటినుండి ప్రపంచ దేశాలు చైనాను దూరం పెట్టడం ప్రారంభించాయి. అయితే ఇందులో భాగంగా మన ఇండియా ప్రభుత్వం టిక్‌టాక్, వీచాట్‌లతో పాటు చైనాకు సంబంధించిన 106 యాప్‌లపై నిషేధం విధించింది. దీని తర్వాత మిగతా దేశాలు కూడా కొన్నిచైనా యాప్స్ ను తొలగించారు. అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం పొంచివుందన్న కారణంగా తాజాగా అమెరికాలో సైతం టిక్‌టాక్, వుయ్‌ చాట్‌ యాప్‌లపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉండగా, టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని మైక్రోసాఫ్‌ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది.
ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక వార్త హల్చల్ చేస్తోంది. మన రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ ఇండియా కి సంబంధించిన టిక్ టాక్ హక్కులను కొనుగోలుచేయడానికి మొగ్గుచూపుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. దీనికి సంబంధించిన మాతృసంస్థ బైట్ డాన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి. అయితే ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మరి ఏంజరగనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: