తెలుగు రాష్ట్రాలలో భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా. ?

Divya
ఈ మధ్యకాలంలో మళ్లీ ప్రజలకు కరోనా టెన్షన్ మొదలవుతోంది ఇప్పటికే ఢిల్లీ తో సహా కేరళ మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో కూడా ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ మరింత ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 54 చేరినట్లుగా సమాచారం.
జిల్లాలో వివిధ ప్రాంతాలలో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రతికూల వాతావరణం వల్ల రోజు రోజు కి కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అవ్వాలని ప్రజలను హెచ్చరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వేను కూడా నిర్వహిస్తోంది మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయి 20 లక్షల బూస్టర్ డోషులను కావాలంటు కేంద్రాన్ని కోరినట్లుగా తెలుస్తోంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి .ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో తొర్రూర్ లో ఎక్కువగా గురుకుల పాఠశాలలో కరోనా కేసులు రావడంతో అక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పాఠశాలలో మొత్తం తొమ్మిది మందికి పైగా పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ చేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బూస్టర్ డోస్ ఇవ్వాలని కూడా  అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పెరుగుతున్న కేసులు నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.ముఖ్యంగా మాస్కులు పెట్టుకొని చేతులు శానిటైజర్ తోనే శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: